వాట్సాప్‌.. స్మార్ట్‌ఫోన్ కొన్ని ప్ర‌తిఒక్క‌రూ మొద‌ట డౌన్‌లోడ్ చేసేది ఈ యాపే అంటే అతిశయోక్తి కాదు. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది వాట్సాప్.  సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ కు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను.. రోజు వారీ అవసరాలకు, ఆఫీస్ ల్లో కమ్యూనికేషన్ కోసం వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. అలాగే వాట్సాప్ అంద‌రికీ ఇష్ట‌మైన మ‌రో ఫీచ‌ర్ వాట్సాప్ స్టేటస్‌. మనసులోని భావాల్ని ఇమేజ్‌/వీడియో/అక్షరాల రూపంలో పెట్టుకునే ఈ వాట్సాప్ స్టేట‌స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

దురదృష్టవశాత్తు వాట్సాప్ ఈ స్టేటస్‌లను డౌన్‌లోడ్ చేయడానికి వినియోగదారులకు అవకాశం ఇవ్వదు. అయితే కొంద‌రు స్క్రీన్ షాట్ తీయడం ద్వారా ఫోటోల‌ను సేవ్ చేసుకుంటారు. అయితే వీడియోల అలా కుద‌ర‌వు. కాబట్టి మీరు ఇత‌ర‌ వాట్సాప్ స్టేటస్‌లోని ఫోటోలు మరియు వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వాట్సాప్ స్టేటస్‌ను చూడండి. ఇప్పుడు ఫైల్ మేనేజర్ యాప్ ను ఓపెన్ చేయండి. 

 

అయితే మీ ఫోన్‌లో ఇది లేకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఫైల్ మేనేజర్ యాప్ యొక్క సెట్టింగ్‌ల పేజీలో కనిపించే షో హిడెన్ ఫైల్‌లను ఎంపికను స్టాట్ చేయండి. ఇక్కడ మీడియా> స్టేటస్‌లకు వెళ్లాలి. ఈ ఫోల్డర్‌లో మీరు గత 24 గంటల్లో చూసిన అన్ని వాట్సాప్ స్టేటస్‌ల వీడియోలు మరియు ఫోటోలను చూడవచ్చు. ఇప్పుడు మీకు కావలసిన ఫోటో లేదా వీడియోను కాపీ చేసి ఇంటర్నల్ స్టోరేజ్ లోని మరొక ఇతర ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవచ్చు.

 
  
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: