ప్ర‌స్తుత‌ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ ఓ నిత్యావసర సాధనంలా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ కనిపిస్తోంది. వై-ఫై నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చాక పోన్ బిల్స్ విపరీతంగా ఆదా అవుతున్నాయి. ఇక ఇప్పుడు కోర‌నా కార‌ణంగా ల‌క్ష‌ల మంది ఇంటి నుంచే ప‌ని చేస్తుంది. దీంతో వైఫైకి మ‌రింత డిమాండ్ పెరిగింది. అయితే మంచి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉన్నా సరే... వైఫై సిగ్నల్  నత్తనడక నడిస్తే క‌ష్ట‌మే క‌దా. కానీ, కొన్ని ట్రిక్స్ పాటిస్తే వైఫై రాకెట్ స్పీడ్‌లో పెంచుకోవ‌చ్చు.

 

వై-ఫై రూటర్‌ను ఇంటి మధ్య భాగంలో సెట్ చేసినట్లయితే సిగ్నల్ అన్ని మూలలకు అందుతుంది.టీవీల దగ్గర వైఫై రూటర్‌ని ఉంచండం వల్ల సిగ్నల్స్ సరిగా అందవని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి.  వైఫై సిగ్నల్‌ కాంక్రీట్‌, వుడ్‌ ఫ్లోరింగ్‌లో నుంచి ప్రసరించలేవు కాబట్టి రూటర్‌ను సాధ్యమైనంత ఎత్తులో బిగించాలి. అప్పుడే పైనున్న ఫ్లోర్‌కు కూడా సిగ్నల్‌ అందుతుంది. అలాగే ముందుగా వైఫై అవసరం లేని డివైజ్‌లు ఏవైనా ఉంటే మీ రౌటర్ నుంచి డిస్‌కనెక్ట్ చేయండి. 

 

స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఇలా మీరు దేనికి వైఫై ఉపయోగించకపోతే ఆ డివైజ్‌ను డిస్‌కనెక్ట్ చేయాలి. అదేవిధంగా, లేటెస్ట్ వై-ఫై టెక్నాలజీని వాడటం వల్ల వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌లను అందుకోవచ్చు.అలాగే ప్లాన్ కూడా అప్ డేట్ అవుతూ ఉండాలి. మ‌రియు మీ వై-ఫై రూటర్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను బయటకు పొక్కకుండా చూసుకోండి. ఇక వైఫై రూటర్‌ను ఎప్పుడూ ఎత్తైన టేబుల్ లేదా అల్మారా పై ఉంచండి. కింద ఉంచడం వల్ల సిగ్నల్స్ అంత తొందరగా అన్ని చోట్లకు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: