నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విప‌రీతంగాపెరుగుతుండడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది. పొద్దున లేచింది మొద‌లు.. రాత్రి ప‌డుకునే ముందు వ‌ర‌కూ స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండాల్సిందే. పార‌పాట‌ను స్మార్ట్ ఫోన్ ఏదైనా సమస్య వచ్చి పనిచేయడం మానేస్తే ఏంచేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాం అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

అయితే చాలా మందిని వేధించే స‌మ‌స్య ప‌వ‌న్ బట‌న్ ప‌నిచేయ‌క‌పోవ‌డం. అలాంట‌ప్పుడు ఫోన్ వినియోగించ‌డం చాలా క‌ష్ట‌తరంగా మారుతుంది. అయితే కొన్ని ట్రిక్స్ ఉప‌యోగించి దాన్ని సులువు చేసుకోవ‌చ్చు. ఛార్జింగ్ నోటిఫికేషన్ సమయంలో డిస్ ప్లే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో అలారం సెట్ చేసుకోవడం ద్వారా  స్కీన్ ఒపెన్ చేయవచ్చు.

 

ఇక ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్ ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. కాబట్టి పవర్ బటన్ పనిచేయకపోయినా ఫరవాలేదు. మీరు పింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫోన్ లాక్ తీయవచ్చు. వాడుకోవచ్చు. అదేవిధంగా, మీరు మీ స్మార్ట్ ఫోన్ ని గ్వెశ్చర్ బేస్ డ్ ఫీచర్స్ ద్వారా కూడా ఫోన్ లాక్ తీయవచ్చు. మీ సెట్టింగ్స్ లో కెళ్లి ఈ ఫీచర్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీ స్క్రీన్ లాక్ తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: