ఆధునిక మానవజీవితం లో కంప్యూటర్ వినియోగం సాధార‌ణం అయిపోయింది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో కంప్యూటర్‌ వినియోగం త‌ప్ప‌నిస‌రి అవుతుంది. ఎందుకంటే ప్రతీది అందులోనే నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో ఈ విద్య తప్పనిసరిగా మారింది. అలాగే నేటి కంప్యూటర్ యుగంలో పలు రకాల అవసరాలకు పర్సనల్ కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగా పెరిగిపోయింది. ఈ క్ర‌మంలోనే కంప్యూటర్ లేనిదే ఏ పనులూ కావటం లేదు అన్నంత‌గా స‌మాజం మారిపోయింది. 

 

మ‌రి ఇంత విడదీయరాని భాగం అయిన కంప్యూటర్ గురించి ప్ర‌తి ఒక్క‌రూ కొన్ని విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా కీబోర్డ్ లేని కంప్యూటింగ్‌ను ఊహించుకోగలమా..?, కంప్యూటింగ్ కార్యకలాపాలలో క్రీయాశీలక పాత్ర పోషించే కీబోర్డ్ కాలానుగుణంగా కొత్త రూపులను సంతరించుకుంటుంది. ఇక‌ కీబోర్డు పై అక్షరాలు వరస కమ్రంలో ఎందుకుండవ్..?. ఈ సందేహం కంప్యూటర్ యూజ్‌ చేసే ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. సాధారణంగా మనం ఉపయోగిస్తున్న కీబోర్డును `క్వర్టీ కీబోర్ట్‌` అని పిలుస్తారు. 

 

ఈ పేరు ఏలా వచ్చిందంటే కీ బోర్డు పై వరసలో ఉన్న ఆరు అక్షరాలు q,w,e,r,t,y కాబట్టి ఆ పదాలను కలిపేసి క్వర్టీ గా పిలుస్తున్నాం. ఇక క్వర్టీ కీబోర్డు క్రియేట్ చేయ‌డానికి ముందు ఎ, బి, సి, డీ లతో కూడిన వరస అక్షరాల కీబోర్డే వాడుకలో ఉండేది. అయితే ఈ కీబోర్డు యూజ్ చేసేట‌ప్పుడు పలు ఇబ్బందులు అంటే.. ఇంగ్లీష్ వార్డ్స్‌లో భాగంగా కొన్ని అక్షరాలు ఎక్కువ సార్లు, మరికొన్ని అక్షరాలు చాలా తక్కువ సార్లు వస్తుంటాయి. వీటిని గమనించిన క్రిస్టోఫర్ క్వర్టీ కీబోర్డు క్రియేట్ చేశారు. దీంతో అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండా, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానల్లో ఉండాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: