క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందులు పెడుతోంది. అయితే క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్  బ్యాంకింగ్‌ వ్యవస్థపై తీవ్ర ప్రతికూలతను చూపుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు పనిగంటలను తగ్గించాయి. ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే పని చేయనున్నారు. అయితే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించాలని కోరుతున్నాయి బ్యాంకులు. ముఖ్యంగా వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ అకౌంట్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. అయితే అన్ని బ్యాంకులు ఈ సేవలు అందించడం లేదు.

 

వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్న బ్యాంకుల్లో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కొటక్ మహీంద్రా, సారస్వత్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి బ్యాంకులు ఉన్నాయి.  కస్టమర్లకు వేగంగా సమాచారాన్ని అందివ్వాలన్న ఉద్దేశంతో ఉచితంగానే వాట్సప్‌లో బ్యాంకింగ్ సర్వీసుల్ని అందిస్తున్నాయి. మీరు కూడా వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు ఎలా పొందాలి? ఏఏ సేవలు పొందొచ్చు? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేవ‌లు వినియోగించుకోవాలంటే.. ముందుగా తమ మొబైల్ నెంబర్ను బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఇందుకోసం బ్యాంకులు నిర్దేశిత మొబైల్ నెంబర్ ను ఏర్పాటు చేస్తాయి. ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ను బ్యాంకుల వెబ్ సైట్ లేదా బ్యాంకు శాఖను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీకు వాట్సప్‌లో బ్యాంకు నుంచి వెల్‌కమ్ టెక్స్‌ట్ మెసేజ్ వస్తుంది. మీరు ఆ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఏదైనా బ్యాంక్ సర్వీస్ పొందాలనుకుంటే ముందుగా హాయ్‌ అని టైప్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి మెసేజెస్ పంపాలి.

 

వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన తర్వాత మీకు గతంలో బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్‌లో వచ్చిన నోటిఫికేషన్స్ ఇకపై వాట్సప్‌లో వస్తాయి. మీ కార్డులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మినీ స్టేట్‌మెంట్, ప్రీఅప్రూవ్డ్ లోన్స్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌లో తెలుసుకోవచ్చు. ఇక మీరు మీ అకౌంట్ నెంబర్లు, పిన్, పాస్‌వర్డ్ లాంటి వివరాలేవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో సమాచారం తెలుసుకోవడం తప్ప లావాదేవీలు చేయడం వాట్సప్ బ్యాంకింగ్‌లో సాధ్యం కాదు. ఇక మీకు వాట్సప్ బ్యాంకింగ్ సర్వీసులు అవసరం లేదను కుంటే డీ ఆక్టివేట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: