యూట్యూబ్… స్మార్ట్‌ఫోన్‌ వాడకం ఎంత పెరిగిందో యూట్యూబ్ వినియోగం కూడా అంతే పెరిగింది. వినోదాల వీచిక.. నైపుణ్యానికి వేదిక.. యూట్యూబ్‌. ముఖ్యంగా ఇతర దేశాలతో పోలిస్తే యూట్యూబ్‌ చూసేవారి సంఖ్య భారత్‌లో అత్యంత వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం సగటున నెలకు 265 మిలియన్ల మంది వీడియోలు బ్రౌజ్‌ చేస్తున్నారు. హాస్యం, క్రీడలు, వార్తలు, విద్య, అందం, ఆరోగ్యం, వెబ్‌సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. రోజు రోజుకూ వీటి వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

యూట్యూబ్ చూస్తున్నారు స‌రే.. మ‌రి దీని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..? గూగుల్ పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను అందిస్తుంది. యూట్యూబ్ కిడ్స్‌గా పిలవబడతున్న ఈ యాప్‌ను కేవలం పిల్లలకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయ‌బ‌డింది. ఇది మీ పిల్ల‌ల‌కు చాలా బాగా యూజ్ అవుతుంది. విద్య, విజ్ఞానం ఇంకా వినోదాలను అందించే వీడియోలను మాత్రమే యూట్యూబ్ ఈ వర్షన్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే లూప్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను యూట్యూబ్ కొత్తగా యాడ్ చేసింది.

ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా వీడియో దానంతటకదే రిపీట్ అవుతుంటుంది. అదేవిధంగా, ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉన్నప్పుడు వీడియోలు ప్లే అవటానికి చాలా సమయం తీసుకుంటాయి. ఇలాంటి పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ‘https://www.youtube.com/account_playback' లింక్ లోకి వెళ్లి `I have a slow internet connection. Never play higher-quality video.` ఆప్షన్ ను సెలక్ట్ చేయండి. దీంతో ఇంటర్నెట్ డేటాను బట్టి తక్కువ రిసల్యూషన్ లో వీడియో ప్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: