జీమెయిల్‌.. ప్ర‌స్తుతం మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగించే మెయిలింగ్ టూల్‌. ప్రతీ రోజు ఏదోక సందర్భంలో ప్రతీ ఒక్కరు ఏదోక విధంగా వాడుతూనే ఉన్నారు. దీనితో సంస్థ కూడా వినియోగదారులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు సరికొత్తగా తన సేవలను అందిస్తుంది. ఇక చాలామంది జీమెయిల్‌ను వాడ‌తారు కానీ వారికి అందులో ఉండే ఫీచ‌ర్ల గురించి పెద్ద‌గా తెలియ‌దు. జ‌స్ట్ మెయిల్స్ పంప‌డం, రిసీవ్ చేసుకోవ‌డం వ‌ర‌కే ఉంటుంది. కానీ దీనిలో ఉండే కొన్ని ఫీచ‌ర్ల ద్వారా మ‌నం చాలా  పనులు చేసుకోవ‌చ్చు. 

 

అందులో ముందుగా ఈమెయిల్‌ షెడ్యూల్‌ సెండ్‌ ఆప్షన్‌. మనం మెయిల్స్‌ను ఎప్పటికప్పుడు పంపుకుంటాం. కానీ రేపు ఉదయం ఫలానా సమయానికి ఒక మెయిల్‌ పంపాల్సి ఉన్నా మర్చిపోతుంటాం. అలాంటప్పుడు మనం మర్చిపోకుండా మెయిల్‌ పంపడానికి జీమెయిల్‌లో ఉన్న ఒక ఫీచర్‌ 'షెడ్యూల్‌ సెండ్‌స‌. ఇందుకోసం మొదటిగా మీరు పంపాలనుకున్న మెయిల్ కంపోజ్ చేయండి. 

 

ఇప్పుడు ఇమెయిల్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత సెండ్ బటన్ పక్కన కనిపించే బాణం బటన్ పై క్లిక్ చేయండి. ఇందులో సమయాన్ని ఎంచుకోండి లేదా మీ ఇమెయిల్ బట్వాడా కావాలనుకున్నప్పుడు మీరు తేదీ మరియు సమయాన్ని ఎంచుకోవచ్చు. తరువాత షెడ్యూల్ సెండ్ పై క్లిక్ చేయండి. దీంతో మీ మెయిల్‌ కచ్ఛితంగా మీరు ఏ తేదీన, ఏ సమయానికి సెట్‌ చేశారో, ఆ తేదీన, ఆ సమయానికి అవతలి వారికి చేరుతుంది. ఇక‌మీరు సాధారణ ఇమెయిల్‌ల మాదిరిగానే మీ షెడ్యూల్ చేసిన ఇమెయిల్‌లను కూడా అన్డు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: