ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎన్ని బ్రాండ్లు వ‌చ్చిన సాంసంగ్‌కు ఉన్న క్రేజే వేరు అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌నాల‌ను ఆక‌ట్టుకునేందుకు అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో అనేక మోడ‌ళ్ల స్మార్ట్‌ఫోన్లు తీసుకువ‌స్తూ దూసుకుపోతోంది. ఇక తాజాగా సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ జాబితాలో మరో మోడల్ చేరిపోయింది. సాంసంగ్ గెలాక్సీ ఎం11 అధికారికంగా రిలీజ్ అయింది.

 

5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ధర సుమారు రూ.9,000 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. సాంసంగ్ యూఏఈ వెబ్‌సైట్‌లో ఈ సరికొత్త మోడల్ లిస్ట్ అయింది. అయితే ఇండియాలో ఎప్పుడు రీలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది.

 

సాంసంగ్ గెలాక్సీ ఎం11 ఫీచ‌ర్ల‌ను ప‌రిశీలిస్తే..
- 6.4 అంగుళాలు డిస్‌ప్లే
- 3 జీబీ ర్యామ్
- 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
- స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్

 

- 13+2+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
- 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- బ్లాక్, మెటాలిక్ బ్లూ, వయొలెట్ కలర్స్
- డ్యూయెల్ సిమ్ సపోర్ట్
- ధ‌ర‌.. రూ.9,000 అంచ‌నా.

మరింత సమాచారం తెలుసుకోండి: