మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్‌.. గురించి నేటి త‌రానికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. స్మార్ట్‌ఫోన్ వాడే ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడం, డేటా కోసం పెట్టే ఖర్చు తక్కువగా ఉండటం, సామాజిక మాధ్యమాలపై వెచ్చించే సమయం ఎక్కువ కావడం రోజువారీ వాట్సాప్‌ వినియోగం పెరిగేందుకు కారణాలు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. 

 

అలాగే మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. ఇక వాట్సాప్‌లో ఎక్కువ‌గా ఉప‌యోగించుకునే ఫీచ‌ర్స్‌లో వీడియో కాలింగ్ కూడా ఒక‌టి. అయితే వాట్సాప్ వీడియె కాలింగ్ వ‌ల్ల ఎక్కువ డేటా ఖ‌ర్చు అవుతుంటుంది. కానీ, ట్రిక్స్ ఫాలో అవ్వ‌డం ద్వారా వాట్సాప్ వీడియె కాలింగ్‌ను ఉప‌యోగించుకున్నా.. డేటాన్ సేవ్ చేసుకోవ‌చ్చు. 

 

అందుకు ముందుగా వాట్సాప్ తెరిచి మూడు నిలువు పాయింట్లను కనిపించే చోట క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా వినియోగం మరియు నిల్వపై నొక్కండి. ఇక్కడ, కాల్ సెట్టింగులలో తక్కువ డేటా వినియోగ ఎంపిక కోసం చూడండి మరియు ఎంపిక ముందు టోగుల్ను యాక్టివేట్ చేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీరు వీడియో కాల్ చేసిన‌ప్ప‌టికీ డేటా సేవ్ అవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: