ఆధార్ కార్డు.. ఎంతో కీలకమైన డాక్యుమెంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. ఇటీవ‌ల కాలంలో ముఖ్యమైన పనులన్నింటికీ ఆధార్ నెంబర్ తప్పనిసరి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు ఆధార్ కావాల్సిందే. అయితే ప్ర‌తి సారి ఆధార్ మ‌న వెంట తీసుకువెళ్ల‌లేము కాబ‌ట్టి.. ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే స‌రిపోతుంది. అదే యూఐడీఏఐ ఎంఆధార్ యాప్‌. ఈ యాప్ ఉంటే మీకు ఆధార్ కార్డు అవపరం లేదు. 

 

ఎందుకంటే మీ వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడికెళ్లినా దీని సహాయంతో మీరు ఇతరులకు చూపించవచ్చు.  ఎంఆధార్ యాప్‌ను 13 భాషల్లో ఉపయోగించొచ్చు. అందులో 12 భారతీయ భాషలు కాగా, మరో భాష ఇంగ్లీష్. ఎంఆధార్ యాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రీప్రింట్, అడ్రస్ అప్‌డేట్, ఇకేవైసీ డౌన్‌లోడ్, స్కాన్ క్యూఆర్ కోడ్, వెరిఫై ఆధార్, వెరిఫై ఇమెయిల్, రిట్రీవ్ యూఐడీ / ఈఐడీ, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ లాంటి సేవలుంటాయి. 

 

మొత్తం 35 రకాల సేవలు ఒకే యాప్‌లో పొందొచ్చు. అలాగే ఆధార్ వెరిఫై చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌ను కూడా వెరిఫై చేసుకోవచ్చు. మ‌రో విష‌యం ఏంటంటే.. ఒకవేళ మీ ఆధార్ వివరాలను ఎవరైనా చట్టవిరుద్ధంగా మీ అనుమతి లేకుండా ఉపయోగించారని భావిస్తే.. అప్పుడు యాప్‌లోని అథంటికేషన్ హిస్టరీకి వెళ్లి మీ ఆధార్ వివరాలు ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇక యాప్ నుంచే మీ ఆధార్ వివరాలను డైరెక్ట్‌గా ఇతరుకు పంపొచ్చు. మ‌రియు ఎంఆధార్ యాప్ ద్వారా మీ ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయొచ్చు.

 
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: