నేటి కాలంలో డెస్క్‌టాప్ పీసీలకు అప్‌డేటెడ్ వర్షన్‌గా పుట్టుకొచ్చిన ల్యాప్‌‌టాప్‌లు, పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. ఇక టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఇప్పుడు అన్నీ త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు కూడా చాలా తక్కువ ధ‌రకే మ‌న‌కు అందుబాటులో ఉండ‌డంతో.. వీటి వినియోగం కూడా బాగానే పెరిగిపోయింది. వివిధ రకాల పనులను చక్కబెట్టుకోవడానికి ఇవి బాగానే పనిచేస్తాయి. 

 

అయితే ల్యాప్‌టాప్ యూజ్‌చేసేట‌ప్పుడు మ‌నం చేసే కొన్ని త‌ప్పులు.. జీవితంలో ఎన్నో ఇబ్బందుల‌కు గురిచేస్తుంది. సాధార‌ణంగా చాలా మంది ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వ‌ర్క్ చేస్తుంటారు. అయితే ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని ఉపయోగించటం వల్ల పురుషులలో వంధ్యత్వం వస్తుంది. ల్యాప్‌టాప్‌ నుంచి వెలువడే అధిక ఉష్ణోగ్రత వీర్య ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దాని వికిరణాలు వీర్య చలనము, నాణ్యతలపై ప్రభావితం చూపిస్తాయి. అలాగే ప్రెగ్నెన్సీ మహిళలలు ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండటం చాలా ఉత్త‌మం అంటున్నారు.

 

ఎందుకంటే ల్యాపీ ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గర్భంతో ఉన్న మహిళల పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఇక చాలామంది ల్యాప్‌టాప్‌ను గంటల తరబడి వాడుతూనే ఉంటారు. అదికూడా ఒడిలో పెట్టుకొని పనిచేస్తుంటారు. ల్యాప్‌టాప్‌ తాకిఉన్న చర్మం దురదగా, వేడిగా మారుతుంది. ఇది చర్మ క్యాన్సర్‌కి దారి తీస్తుంది. కాబ‌ట్టి.. ల్యాప్ టాప్ యూజర్లు ముందుగా ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకోవటం మానుకోవాలి. ఈ అలవాటను మానుకోని పక్షంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదురోకవల్సి వస్తుంది.

 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: