ఆరోగ్య సేతు యాప్‌... క‌రోనాను అదుపు చేసేందుకు కేంద్రం ఇటీవల విడుదల చేసిన యాప్ ఇది. కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు క్వారంటీన్‌లో ఉంచినవారిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఆ యాప్‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకుంది. ఇది కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా క‌రోనా బారిన పడిన వారు మన దగ్గరికి సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ తెలుసుకుంటే ఈ ఆరోగ్య సేతు యాప్ వినియోగించ‌డం మ‌రింత సులువు అవుతుంది.

 

ఈ ఆరోగ్య సేతు యాప్ హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. మీరు ఈ యాప్ ను ఓపెన్ చేసిన వెంటనే ముందుగా భాషను ఎంచుకోమని కోరుతుంది. కాబట్టి వీటిలో మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. ఇక ట్రాకింగ్‌ను ప్రారంభించడం కోసం ఫోన్‌లో జీపీఎస్‌, బ్లూటూత్‌ సిస్టమ్‌ను ఆన్‌లో ఉంచాలి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ పేజీ కనిపిస్తుంది. అందులో నాలుగు స్లైడ్లు ఉంటాయి. ఈ నాలుగు స్లైడ్లనూ స్వైప్ చేశాక చివరి స్లైడ్ లో రిజిస్టర్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.

 

ఒకవేళ మీకు తెలియకుండా కరోనావైరస్ ను కలిగి ఉన్న వ్యక్తి ఉన్న ప్రాంతంలోకి మీరు వెళ్లినట్లయితే మిమ్మల్ని అలెర్ట్ చేయడం వంటి యాప్ సంబంధిత విషయాలను ఈ స్లైడ్లలో తెలియజేస్తారు. ఇక ఇందులో మీ మొబైల్ నంబర్ ను అందించిన అనంతరం దాన్ని ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. మీ పేరు, వయస్సు, వృత్తి, మీరు విదేశాలకు వెళ్లి వచ్చారా? వంటి ప్రశ్నలను అడిగే ఆప్షనల్ ఫారం ఒకటి ఉంటుంది. మీకు నచ్చితేనే ఇందులో అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వవచ్చు.

 

అయితే అక్క‌డ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌డం వ‌ల్ల మీ హెల్త్ కండీష‌న్ తెలియ‌జేస్తుంది. ఇక ఈ యాప్ ద్వారా దేశంలో కరోనా కేసుల రిపోర్టు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కరోనాను దరి చేరనివ్వదు. మ‌రియు కరోనా వైరస్ ఉన్న వ్యక్తి దగ్గరకు మీరు వెళ్తే యాప్ తక్షణమే మీ లొకేషన్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: