స్మార్ట్ ఫోన్స్ కి ఉండే ప్రత్యేకత ఇదే.. 3వేల ఫోన్ పనిచేస్తుంది.. 3 లక్షల స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.. అయితే దానికి దీనికి కొన్ని ఆప్షన్లు మారుతాయి అంతే.. ఎవరి బడ్జెట్ ప్రకారం వారు స్మార్ట్ ఫోన్లు తీసుకొని ఎంజాయ్ చేస్తుంటారు అంతే. అలాంటి ఈ స్మార్ట్ ఫోన్లలో అది తక్కువ ధరకే వచ్చే అదిరిపోయే ఫోన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. కుదిరితే ఒక పీస్ కొని పెట్టుకోండి.. ఎప్పుడైనా ఫోన్ ఉన్నట్టుండి పగిలిన.. పని చేయకపోయినా ఆ పీస్ అవసరానికి పనికి వస్తుంది.. 

 

షియోమీ రెడ్ మీ 4 ఏ.. 

 

షియోమీ రెడ్ మీ 4 ఏ.. ఇది ఒక బ్రాండ్ ఫోన్. నిజం చెప్పాలి అంటే? ఈ స్మార్ట్ ఫోన్ లో ఏ ఫీచర్లు అయితే ఉంటాయో అవే ఫీచర్లు రెడ్ మీ 5, 6, 7 లో కూడా ఉంటాయి.. కాకపోతే కొంచం అప్డేట్ అయి ఉంటుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో 2 జిబి ర్యామ్, 26 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ఇందులో 13 ఎంపీ రేర్ కెమెరా కలిగిఉంది.. ఇంకా బ్యాటరీ 3120 mAh కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ. 5999లే. 

 

Xolo Era X.. 

 

స్మార్ట్ ఫోన్ లో 3 జిబి ర్యామ్.. 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.. ఇంకా ఇందులో 8 ఎంపీ రేర్ అండ్ 5 ఎంపీ ఫ్రెంట్ కెమెరాస్ కలిసి ఉన్నాయి.. ఇంకా ఇందులో బ్యాటరీ సామర్ధ్యం కాస్త తక్కువ.. కేవలం 2500mAh బ్యాటరీ. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.5777. 

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్ పి 4జి.. 

 

స్మార్ట్ ఫోన్ లో 3జిబి ర్యామ్.. 16 జిబ్ స్టోరేజ్ కలిగి ఉన్నాయి.. ఇంకా ఇందులో ఫ్రంట్ 8 ఎంపీ అండ్ 2 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ ఉన్నాయి.. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ కేవలం 2000mAh ఏ. ఈ ఫోన్ కు ఇంతకంటే ప్రత్యేకతలు ఏమి లేవు.. 

 

Xolo Era 1X.. 

 

స్మార్ట్ ఫోన్ లో 1జిబి ర్యామ్.. 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్నాయి. 8 ఎంపీ రేర్ కెమెరా ఉంది. ఇంకా బ్యాటరీ సామర్ధ్యం కూడా 2500mAh ఏ... ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం 4999 రూపాయిలే. 

 

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 4జి.. 

 

స్మార్ట్ ఫోన్ లో 2 జిబి ర్యామ్.. 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్నాయి. 8 ఎంపీ రేర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాటరీ సామర్ధ్యం ఒక్కటి ఎక్కువ.. 4000mAh బ్యాటరీ. ఈ స్మార్ట్ ఫోన్ చూస్తే అనిపిస్తుంది పేరు గొప్ప ఊరు దిబ్బ అని.. ఆప్షన్లు ఏమి లేవు కానీ ఈ స్మార్ట్ ఫోన్ ధర 7778 రూపాయిలంటా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: