ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి చుట్టుముట్టిన సంగ‌తి తెలిసిందే. క‌రోనాను క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో దేశ‌దేశాలు లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఎయిర్‌టెల్‌, వొడా ఫోన్‌ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. లాక్‌డౌన్‌ కారణంగా రీచార్జి చేసుకునే అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వినియోగదారులకు ఆయా సంస్థల యాజమాన్యాలు ఇకపై ఏటీఎంల్లో రీచార్జి చేసుకోవచ్చని తెలిపాయి.

 

ఇప్ప‌టికే రిలయెన్స్ జియో త‌మ సబ్‌స్క్రైబర్ల‌కు ఈ అవ‌కాశాన్ని అందించింది. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్‌, వొడా ఫోన్ సంస్థ‌లు కూడా ముంద‌డుగు వేశాయి. అందుకు ముందుగా ఏటీఎంలో మీ డెబిట్ కార్డును ఇన్సర్ట్ చేయండి.మెనూలో రీఛార్జ్‌ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. 10 అంకెలు మాత్రమే ఎంటర్ చేయాలి. కంట్రీ కోడ్ అంటే 91 ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయండి. 

 

మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటారో అంత అమౌంట్ టైప్ చేయండి. ఆ తర్వాతి స్టెప్‌లో కన్ఫామ్ చేయండి. స్క్రీన్ పైన రీఛార్జ్ మెసేజ్ కనిపిస్తుంది. మీ అకౌంట్‌లోంచి డబ్బులు డెబిట్ అవుతాయి. ఆన్‌లైన్‌లో రీచార్జి చేసుకోలేని వారికి మాత్రమే ఏటీఎంలో రీచార్జి జరుగుతుంది. దీనికి అదనంగా ఎంపిక చేసిన కొన్ని కిరాణా, ఫార్మసీ దుకాణాల్లో కూడా రీచార్జి చేసుకునే  సదుపాయం కల్పించినట్టు పేర్కొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: