ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వైర‌స్‌కు జ‌న్మ‌స్థాన‌మైన చైనాలోని వూహాన్‌లో ప‌రిస్థితి చ‌క్క‌బ‌డ్డ‌ప్ప‌టికీ మిగ‌తా దేశాల్లో మాత్రం దీని విజృంభణ ఎంత‌కూ త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,13,243 చేర‌గా.. 88,403 మంది మృత్యువాతపడ్డారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టీ చూస్తుంటే క‌రోనా దెబ్బ‌కు అగ్ర దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.. చిన్న దేశాలు చితికిపోతున్నాయి.. బలమున్నా, లేకున్నా బలి కావాల్సిందే అన్న రీతిలో ఉంది. 

 

అయితే ఈ మ‌హమ్మారి వ్యాప్తిని నివారించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ బాట‌లో నడిచాయి. భార‌త్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. మ‌న దేశంలోనూ ప్ర‌భుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను విధించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. అయితే ప్రజలంతా ఇళ్ళలోనే గడుపుతుండడంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. 

 

ఈ క్ర‌మంలోనే ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తున్నారనేది గూగుల్ ట్రెండ్స్ ద్వారా తెలిసింది. గూగుల్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఎక్కువ మంది తరచూ కొత్త కొత్త‌ వంటకాల కోసం సెర్చ్ చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు నెట్‌ప్లిక్స్, ఆరోగ్య సంబంధిత విషయాలు, పోర్నో, ఆట‌లు వంటివి కూడా ఎక్కువగా సెర్చ్ చేస్తున్నార‌ట‌. ఏదేమైన‌ప్ప‌టికీ ఆ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని కొంద‌రు బాగానే ఉప‌యోగించుకుంటున్నా.. కొంద‌రు మాత్రం త‌ప్పుదోవ ప‌డుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: