కొంతమంది కెమెరా ప్రియులు ఉంటారు.. ఏం కనిపించిన సరే ఫోటో అద్భుతంగా తీస్తుంటారు.. అయితే కొన్ని ఫోన్లలో తీసే ఫోటోలు క్లారిటీగా రావు.. అలాంటి సమయంలో కెమెరానే స్పెషల్ గా ఉండే ఫోన్లు కావలి అని అనుకుంటుంటారు.. అలా అనుకున్న వారి కోసమే షియోమీ ఎంఐ 10 పేరిట 108 మెగా పిక్సెల్ కెమెరాను లాంచ్ చేసింది. ఆ కెమెరా ఫోన్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. 

 

దీంతో షియోమీ 144 మెగా పిక్సెల్ కెమెరాపై పనిచేస్తుంది అని గుసగుసలు వినిపించాయి.. అయితే ఇంతలోనే ఓ వార్త తెరపైకి వచ్చి అందరిని ఆశ్చర్యపరించింది.. అది ఏంటి అంటే? 144 మెగా పిక్సల్ కాదు ఏకంగా 192 మెగా పిక్సెల్ కెమెరా వచ్చే నెల లాంచ్ కానుందని లీక్ అయ్యింది.. 

 

మరి ఈ లీక్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ 192 మెగా పిక్సెల్ కెమెరాను SM7250 అనే మోడల్ నంబర్ తో చేయనున్నట్టు ఆ లీక్ పేజీలో ఉంది. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ.. ఒకేసారి 192 మెగా పిక్సెల్ కెమెరా అంటే అందరూ షాక్ కి గురయ్యారు.. నిజంగా 192 మెగా పిక్సెల్ కెమెరా వస్తుందా? అది కూడా వచ్చే నెలలో అని.

మరింత సమాచారం తెలుసుకోండి: