క‌రోనా రోజురోజుకు విస్త‌రించ‌డంతో ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు ప్రతి దేశం కూడా లాక్ డౌన్ అమలు చేస్తుంది. ఇక మ‌రోవైను క‌రోనా దెబ్బ‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఉద్యోగులకు ఆదేశాలిచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల  చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇక మ‌రి కొంద‌రు స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు, వీడియోలు ఎక్కువ స‌మ‌యం గ‌డిపేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి త‌లెత్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య డేటా స‌రిపోక‌పోవ‌డం.

 

సాధార‌ణంగా ఎక్కువగా రోజూ 1.5 జీబీ లేదా 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం అలవాటు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ 4జీ డేటా ఏమాత్రం సరిపోవట్లేదు. అయితే ఇలాంటి వారికి జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రోజూ 3 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. మ‌రి వాటి ధ‌ర‌లు ఎంత‌..? అందులో మీకు ఏది బెస్ట్‌..? అన్న‌ది ఇప్ప‌డు తెలుసుకోండి.

 

ఎయిర్‌టెల్: ఎయిర్‌టెల్‌లో రూ.398 రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఈ ప్యాక్ ద్వారా మొత్తం 84 జీబీ డేటా మీరు పొందొచ్చు. 

 

జియో: జియోలో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3 జీబీ డేటా పొందొచ్చు. వేలిడిటీ 28 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఈ ప్యాక్ ద్వారా మొత్తం 84 జీబీ డేటా మీరు పొందొచ్చు. ఇందులో మ‌రో విష‌యం ఏంటంటే.. రోజూ 3జీబీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ స్పీడ్‌లో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. 

 

వొడాఫోన్ ఐడియా: వొడాఫోన్ ఐడియాలో రూ.398 రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. ఈ ప్యాక్ ద్వారా మొత్తం 84 జీబీ డేటా మీరు పొందొచ్చు. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: