వాట్సాప్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. స్మార్ట్‌ఫోన్ వినియోగ‌స్తున్న ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్ ప్రియులే. మెసేజ్‌లు పంప‌డం.. ఫోటోలు, వీడియోలు సెండ చేయ‌డం.. వీడియో కాల్స్ చేసుకోవ‌డం.. ఇలా అనేక విధాలుగా వాట్సాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇప్ప‌టికే  బిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకున్న ఈ ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తూ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తోంది. ఇక ప్ర‌స్తుతం వాట్సాప్ వినియోగం లాక్‌డౌన్ కార‌ణంగా మ‌రింత పెరిగిపోయింది. 

 

అయితే వాట్సాప్ గ్రూపులలో సాధారణంగా స్వీకరించే మెసేజ్ల మొత్తాన్ని కూడా పెంచింది. కొంత మందికి కొన్ని సార్లు ఈ మెసేజ్ లు రావడం కాస్త బాధించే విధంగా కూడా ఉంటుంది. అలాంట‌ప్పుడు వాటిని మ్యూట్ చేయ‌డం వ‌ల్ల మీకు మెసేజ్లు వ‌స్తాయి కానీ, ఫోన్ వైబ్రేట్ అవ్వదు లేదా నోటిఫికేషన్ టోన్‌ ప్లే కాదు. వాస్తవానికి ఇది నోటిఫికేషన్ ప్యానెల్‌లో కూడా చూప‌దు. ఇందుకు కొన్ని సెట్టింగ్స్ మారిస్తే స‌రిపోతుంది. అందుకు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి మ్యూట్ చేయవలసిన గ్రూప్‌ను ఎంచుకోవాలి.

 

ఇప్పుడు గ్రూప్ పేరు మీద ఎక్కువసేపు నొక్కి ఉంచండి. అప్పుడు అందులో కనిపించే 'మ్యూట్' గుర్తును ఎంచుకోండి. ప్రత్యామ్నాయంగా మీరు గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేసి తరువాత మూడు ఐకాన్‌లపై నొక్కండి. తరువాత మ్యూట్ నోటిఫికేషన్ ఎంపికను ఎంచుకోవచ్చు. ఇప్పుడు మీరు గ్రూప్ నోటిఫికేషన్‌లను మ్యూట్‌లో ఉంచాలనుకుంటే ఓకే బటన్ మీద నొక్కండి. అలాగే గ్రూప్ నోటిఫికేషన్‌లను అన్‌మ్యూట్ చేయడానికి గ్రూప్ చాట్‌కు వెళ్లి కుడివైపు ఎగువ మూలలో గల మూడు చుక్కలపై నొక్కి నోటిఫికేషన్‌లను అన్‌మ్యూట్ చేస్తే స‌రిపోతుంది.

 
 
 
 
 

  

మరింత సమాచారం తెలుసుకోండి: