ప్ర‌ముఖ టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న ఫైబ‌ర్ వినియోగ‌దారుల‌కు అదిరిపోయే ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు వెళ్ల‌డం లేదు. ఈ క్ర‌మంలోనే జియో త‌న వినియోగ‌దారుల్లో చాలా మంది బ‌య‌ట‌కు వెళ్లి రీచార్జ్ చేసుకునే ఆప్ష‌న్ లేక‌పోవ‌డంతో రిల‌య‌న్స్ త‌న యూజ‌ర్లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని జియో ఫైబ‌ర్‌లో అందుబాటులో ఉన్న అన్ని ప్లాన్ల‌పై డ‌బుల్ డేటాను అందిస్తున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ మేర‌కు జియో ఫైబ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

 

అలాగే కొత్త క‌నెక్ష‌న్ తీసుకున్న వారు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. లాక్ డౌన్ న‌డుస్తున్నా దేశ‌వ్యాప్తంగా త‌మ సిబ్బంది మాత్రం 24 గంట‌లు ప‌ని చేస్తున్నార‌ని కూడా ప్ర‌క‌టించింది. వినియోగ‌దారులు 1 జీబీపీఎస్ గ‌రిష్ట స్పీడ్‌తో ఇంట‌ర్నెట్ పొంద‌వ‌చ్చ‌ని.. కొత్త క‌నెక్ష‌న్ తీసుకున్న వారు  నెల‌కు 100 జీబీ ఉచిత డేటాతో 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్ పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. ఏదేమైనా ఇది జియో వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ అనే చెప్పాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: