ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావేకు సబ్ బ్రాండ్ అయిన హానర్ నుండి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు చైనా మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే ఆ స్మార్ట్ ఫోన్లు హానర్ ప్లే 4టీ, హానర్ ప్లే 4టీ ప్రో. ఇప్పటికే ఎన్నో సూపర్ ఫోన్లు వచ్చిన ఈ బ్రాండ్ నుండి ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ విడుదల కానున్నాయి. వీటి ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి. హానర్ ప్లే 4టీ ప్రో స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 16,200 రూపాయిలు, ఇంకా హానర్ ప్లే 4టీ ప్రో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 12,000 రూపాయలుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ బ్లూ, ఎమరాల్డ్, బ్లాక్ రంగుల్లో లభించనున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేది ఇంకా వెల్లడించలేదు.. 


 
హానర్ ప్లే 4టీ ప్రో స్పెసిఫికేషన్స్.. 

 

6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే,

 

ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీగా + మైక్రో ఎస్ డీ కార్డుతో 256 జీబీ,

 

 ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. 

 

48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్. 

 

బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్. 

 

​హానర్ ప్లే 4టీ స్పెసిఫికేషన్స్.. 

 

6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

 

ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీగా + మైక్రో ఎస్ డీ కార్డు 256 జీబీ, 

 

వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 

 

48 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

 

బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్. 

 

చూశారుగా.. ఈ స్మార్ట్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కోనేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: