లక్డౌన్ కారణంగా మర్చి నేలనుండి ఇప్పటివరకు ఆన్ లైన్ అమ్మకాలు జరగలేదు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించడానికి అనుమతించనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు.దీనితో  ఏప్రిల్ 20 నుంచి మొబైల్ ఫోన్లు, ఫ్లిప్‌కార్ట్,టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు మరియు స్థిర వస్తువులను అమెజాన్,  స్నాప్‌డీల్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించడానికి  అనుమతి లభించినట్లయింది. 


 హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లాక్ డౌన్ నిబంధలను సవరించి మార్గదర్శకాలను జారీ చేశారు.  తర్వాత హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి నుండి ఈ స్పష్టత వచ్చింది.ఇ-కామర్స్ కంపెనీల డెలివరీ వ్యాన్లకు రోడ్లపై ప్రయాణించడానికి అధికారుల అనుమతి అవసరం. కాగా  ఇ-కామర్స్ కంపెనీల డెలివరీ వ్యాన్లకు రోడ్లపై ప్రయాణించడానికి కేంద్రం నుండి అనుమతి లభిస్తుందని తెలిపింది.

 

ఇ-కామర్స్ రంగాన్ని తెరవడం ద్వారా, పెద్ద స్థాయి ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇ-కామర్స్ కి సంబందించిన పరికరాలను లేదా పార్సిళ్లను ట్రక్ లలో తీసుకువెళ్ళడానికి ఇద్దరు డ్రైవర్లు మరియు ఒక కార్మికుడికి అనుమతి లభిస్తుంది. అదేవిధంగా ట్రక్ లు రిపేర్లు మరియు బోజనవసతి కోసం రోడ్ల వెంబడి డాబాలకు మరియు రిపేర్ షాప్ లకు అనుమతి ఇవ్వబడింది . అయితే లాక్ డౌన్ మే 3 వరకు ప్రజా ప్రయోజనార్ధం పొడిగించబడిన విషయం తెలిసిందే . 

మరింత సమాచారం తెలుసుకోండి: