ప్ర‌స్తుతం కాలంలో నిత్యావసరాల్లో కంప్యూటర్ కూడా ఓ భాగంగా మారిపోయింది. కంప్యూటర్ల వినియోగం విస్తృతమైన నేపథ్యంలో దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కంప్యూటర్ దర్శనమిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కూడా కంప్యూటర్ ను వినియోగిస్తున్నారు. ఇక ఉద్యోగం దగ్గరి నుంచి ఇంటికి సంబంధించి సరుకుల కొనుగోలు, బిల్లుల చెల్లింపుల దాకా అంతా కంప్యూట‌ర్‌లోనే జ‌రుగుతుంది. అయితే ఒక్కోసారి మ‌నం కంగారులో చేసే కొన్ని పొర‌పాటుల వ‌ల్ల బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోతుంటుంది.

 

ఆ టైమ్‌లో దాన్ని తిరిగి ఎలా పొందాలి అనేది చాలా మంది అవ‌గాహ‌న ఉండ‌దు. అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే మీ ముఖ్యం ఫోల్డ‌ర్‌ను మ‌ళ్లీ తిరిగి పొందొచ్చు. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. అందుకు ముందుగా రిసైకిల్ బిన్‌లోకి వెళ్లి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.

 

అలాగే మీ ఫైల్ శాస్వుతంగా డిలీట్ అయితే మాత్రం థర్డ్ పార్టీ సాఫ్ట్‌‌వేర్‌ను ఎంచుకోవాలి. డేటా రికవరీకి సంబంధించి మిశ్రమ ఫలితాలను రాబట్టే సాఫ్ట్‌వేర్ గెట్ డేటా బ్యాక్. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సంబంధిత సైట్‌లోకి లాగినై కొంత మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా మీ ఫైల్‌ను మ‌ళ్లీ పొందొచ్చు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. డిలీటైన ఫైల్‌ను తిరిగిపొందాలనుకునే వారు రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తే మంచి ఫ‌లితం పొందొచ్చ‌ని అంటున్నారు. కాబ‌ట్టి.. మీకు కూడా ఇలాంటి సంద‌ర్భాలు ఉంటే.. ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: