నేటి కాలంలో ప్ర‌జ‌ల‌ను డ‌బ్బులు తీసుకోవ‌డానికి బ్యాంకుల చుట్టూ తిర‌గ‌కుండా.. ఏటీఎంనే న‌మ్ముకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఏటీఎంల ఎక్క‌డిక‌క్క‌డ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే వస్తోంది. ఇక ఏటీఎంలో ఉచితంగా డబ్బులు డ్రా చేయడంతో పాటు మరిన్ని సేవల్ని ఫ్రీగా పొందొచ్చు. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఏటీఎంకు వెళ్లి మరీ బ్యాంకింగ్ సేవల్ని పొందొచ్చు. అయితే కార్డు లేక‌పోయినా ఏటీఎంలో డ‌బ్బు డ్రా చేయ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా..?

 

అవును! డెబిట్ కార్డు లేక‌పోయినా మ‌నం ఏటీఎంలో డ‌బ్బులు డ్రా చేయ‌వ‌చ్చు.  బ్యాంకులను బట్టి రోజువారీ లేదా ట్రాన్సాక్షన్ వారీగా రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు లిమిట్ ఉంది. ఇందుకు ముందుగా.. స్మార్ట్ ఫోనులో బ్యాంక్ కు సంబంధించిన మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాప్ లోకి లాగిన్ అవ్వండి. ఆ త‌ర్వాత సర్వీసెస్ ఆప్షన్ లోకి వెళ్లి.. కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ ఫర్ సెల్ఫ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎంత డ‌బ్బు కావాలి..? 4 డిజిట్ పిన్ నంబర్..? అకౌంట్ నంబర్ ను అడుగుతుంది.సరైన వివ‌రాలు ఎంచుకున్న‌ తర్వాత... సబ్మిట్ బటన్ క్లీక్ చేయండి. ఇప్పుడు మీకు సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. 

 

అదే టైమ్‌లో మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు బ్యాంకు నుంచి ఒక యూనిక్ కోడ్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ఈ కోడ్ ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు సదరు బ్యాంకుకు చెందిన ఏటీఎంకు వినియోగదారుడు వెళ్లి.. ఏటీఎం మెషీన్ లో రిజిస్టర్డ్స్ మొబైల్ నంబర్, యూనిక్ కోడ్, ఏదైనా ఇతర టెంపరరీ కోడ్ వచ్చినట్టైతే దాన్ని కూడా ఎంటర్ చేయాలి. దీంతో పాటు యాప్ లో ఎంటర్ చేసిన విత్ డ్రాయల్ అమౌంట్ ను కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. ఈ వివరాలను ఏటీఎం మెషీన్ సరిచూసుకున్న వెంటనే... మనకు కావాల్సిన మొత్తాన్ని డిస్పెన్స్ చేస్తుంది. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే యాప్ లో ఎంటర్ చేసిన విత్ డ్రాయల్ అమౌంట్ ను ఏటీఎంలో ఒకే ట్రాన్సాక్షన్ లో తీసుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: