వాట్సాప్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. నేటి త‌రంలో స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న వారంద‌రూ వాట్స్‌ప్‌ను సైతం యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మెసేజింగ్, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడానికి వాట్సాప్ ఒక సులువైన వేదిక‌గా మారింది. ఈ క్ర‌మంలోనే కోట్లాది మంచి వాట్సాప్‌ను వినియోగిస్తుత‌న్నారు. అయితే వాట్సాప్ కూడా యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తుంటుంది. ఇక తాజాగా కూడా వాట్సాప్ త‌మ యూజ‌ర్ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

 

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తుంది. ప్ర‌స్తుతం దీనికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో అంద‌రూ నివార‌ణ‌పైనే ఫోక‌స్ చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లు ‌దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో అంద‌రూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గతంలోలా స్నేహితులతో గుంపులుగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే అవకాశం లేదు. స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులతో మాట్లాడుకోవడానికి అందరూ మొబైల్‌ యాప్‌లను అధికంగా వాడేస్తున్నారు. అయితే  ఇలాంటి వారి కోసం వాట్సప్‌ తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్ వ‌ల్ల‌ ఇకపై వాట్సప్ గ్రూప్‌ కాల్‌లో చాలా మంది ఒకేసారి మాట్లాడుకోవచ్చు. ప్ర‌స్తుతం వాట్సప్‌లో వీడియో కాల్స్ చేయాలంటే ఒకేసారి నలుగురికి మించి యాడ్ చేయలేరు. 

 

అందుకే పార్టిసిపెంట్స్ సంఖ్య పెంచాలని వాట్సప్ నిర్ణయించింది. వాట్సప్ వీడియో కాల్స్, ఆడియో కాల్స్‌లో పార్టిసిపెంట్స్ సంఖ్య త్వరలో పెరగనుందని తాజాగా వెల్ల‌డించారు. అయితే ఆ సంఖ్య ఎంతకు పెరగనుందన్న సమాచారం అయితే లేదు. ఇక వాట్సప్ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వ‌చ్చింద‌ని, త్వరలోనే యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. కాగా,  జూమ్, గూగుల్‌ డుయో వంటి యాప్‌లు పదులకొద్దీ యూజర్లు ఒకేసారి గ్రూప్‌కాల్‌లో మాట్లాడుకునే అవకాశాలు ఇస్తున్నాయి. అందుకే ఇప్పుడు వాట్సాప్ కూడా ఇటువంటి ఫీచరునే తీసుకురావడానికి సిద్ధమైంద‌ని తెలుస్తోంది.

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: