ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను తీవ్ర స్థాయిలో వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ర‌క్క‌సికి అడ్డుక‌ట్ట వేసేందుకు దేశ‌దేశాలు అలుపెరుగ‌ని పోరాటాలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా జోరు త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే క‌రోనా పోజిటివ్ కేసులు సంఖ్య 20 ల‌క్ష‌ల మార్క్ దాట‌గా.. మ‌ర‌ణాల సంఖ్య 1 ల‌క్ష 40 వేలు దాటింది. ఇక క‌రోనాను నియంత్రించాలంటే భౌతిక దూరం, వ్య‌క్త‌గ‌త శుభ్ర‌త మార్గులుగా క‌నిపించ‌డంతో.. ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. 

 

ఈ క్ర‌మంలోనే  గేమ్స్ ఆడటం, సినిమాలు చూస్తూ మొబైల్స్‌కే ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. అయితేమొబైల్‌లో ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడీ ఆడీ బోర్‌గా ఫీల్ అయ్యే ఉంటారు. అందులోనూ ముఖ్యంగా స్మాల్ స్క్రీన్‌పై కొన్ని రకాల గేమ్స్ ఆడాలంటే ఇబ్బంది పడే వారు చాలా మంది ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే ఓ కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా కంప్యూటర్‌లోనే ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడుకోవ‌చ్చు. ఇందు  కోసమే ‘బ్లూ స్టాక్స్’ సాఫ్ట్ వేర్‌ వెర్షన్‌లో వస్తోంది. దీన్ని ఎవరైనా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని గేమ్స్ ఆడుకొచ్చు. అందుకోసం WWW.Bluestacks.com లింక్‌లోకి వెళ్లండి. 

 

అంతకంటే ముందు ఈ సాఫ్ట్‌ వేర్ గురించి ఖ‌చ్చితంగా తెలుసుకోండి. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రస్తుతం ఆండ్రాయిడ్ 7.1.2 వెర్షన్‌తో కంప్యూటర్‌లో గేమ్స్ ఆడ‌వచ్చు. అందువల్ల హై గ్రాఫిక్స్‌తో గేమ్స్‌ ప్లే అవుతాయి. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఇందులో గేమ్స్ ఆడేవారు పాయింట్లు గెలుచుకోవ‌చ్చు. వాటి ద్వారా ప్రైజెస్ పొందే ఆఫర్ కూడా ఉంటుంది. మ‌రియు ఈ బ్లూస్టాక్స్ వంద‌కి పైగా మొబైల్ గేమింగ్ కంపెనీల్లో భాగస్వామిగా ఉంది. పెద్ద గేమ్స్‌ తయారీలో కూడా ఇది పాలు పంచుకుంటోంది. సో.. కంప్యూటర్‌లో ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడాల‌నుకునే వారు ఈ బ్లూస్టాక్స్ సాఫ్ట్ వేరును యూజ్ చేసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: