ఇటీవ‌ల కాలంలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి ప్ర‌ముఖ యాప్స్‌లో చాలా మంది ఎప్పుడు చూసినా ఎమోజీలతోనే మాట్లాడేసుకుంటున్నారు. లైన్లుకు లైన్లు టైప్‌ చేసే కన్నా సందర్భానికి తగ్గట్లు.. మన భావాలను సుస్పష్టంగా వ్యక్తపరిచేందుకు ఓ ఎమోజీ ఎంపిక చేసుకొని పంపిస్తే.. చాటింగ్ కూడా ఎంతో సులువుగా మారింది. అయితే సోషల్‌మీడియా ఆరంభంలో వీటి వాడకం తక్కువగా ఉన్నా క్రమంగా ఆసక్తికరమైన ఎమోజీలు పుట్టుకు రావడంతో నెటిజన్లు వీటిని ఎక్కువ‌గా యూజ్ చేస్తున్నారు.

 

ముఖ్యంగా యువతరం ఎమోజీలను వినియోగించటంలో ముందజలో ఉంది. ఇక ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను విస్త‌రించి.. అనేక మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. మ‌రోవైపు ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 22 ల‌క్ష‌లు దాటిందంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో స్ప‌ష్టంగా అర్థం అవుతుంది. మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు దేశ‌దేశాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే ఈ మ‌హ‌మ్మారిపై యూజర్లు త‌మ స్పంద‌న‌ను వ్య‌క్తం చేసేందుకు ఫేస్‌బుక్ తాజాగా రెండు ఎమోజీల‌ను యాడ్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు ర‌కాల ఫేస్‌బుక్ ఎమోజీలు ఉండ‌గా మ‌రో రెండు ఎమోజీల‌ను యాడ్ చేసింది.

 

అందులో ఒకటి హృదయాన్ని ముఖానికి అడ్డుకున్నట్లుగా ఒక ఎమోజీ కాగా, మరొకటి హార్ట్ సింబల్‌ని కూడా జత చేసింది. ఫేస్‌బుక్ యాప్‌తోపాటు మెసేంజ‌ర్‌లోనూ ఈ ఎమోజీలు త్వ‌ర‌లో అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఫేస్‌బుక్ సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ అలెగ్జాండ్రు వొయికా వెల్ల‌డించారు. అలాగే ఈ ఎమోజీలు వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. అలాగే వీటిని ఎలా ఉపయోగించాలో తెలుపుతూ వీడియో కూడా ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మ‌రియు ఇలాంటి విప‌త్క‌ర‌మైన స‌మ‌యాల్లో త‌మ స్పంద‌న‌ను వ్య‌క్త ప‌రిచేందుకు ఈ రెండు ఎమోజీలు యూజ్ అవుతుంద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: