క‌రోనా వైర‌స్‌కు మందు క‌నుగోన‌డంతోపాటు దాని అరిక‌ట్టే చ‌ర్య‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా ఈ విష‌యంలో ఎంతో ముందున్నాయ‌నే చెప్పాలి. వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా దాని సంచ‌రాన్ని గుర్తించేందుకు వీలుగా ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నారు. ఈక్ర‌మంలోనే కరోనా వైరస్‌ ఆనవాళ్లను  పట్టేసేందుకు బయోసెన్సర్‌ ఒకటి రూపుదిద్దుకోవ‌డం ఆశాజ‌న‌క‌మైన విష‌యంగా చెప్పుకోవాలి. స్విట్జ‌ర్జాండ్‌కు చెందిన‌   ప్రొఫెసర్‌ జింగ్‌వాంగ్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం దీనిని ఆవిష్క‌రించింది. ఆయన స్విట్జర్లాండ్‌లోని ‘ఎంపా’(జ్యూరిచ్‌) పరిశోధనశాలలో చాలా కాలంగా  పనిచేస్తున్నారు. 

 

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనశాలల్లో రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌(ఆర్‌టీ-పీసీఆర్‌) పద్ధతిని ఉపయోగిస్తున్నారు.అయితే ఫలితాలు వెల్లడయ్యేందుకు ఆలస్యమవుతుండ‌టం దీనికి ప్ర‌ధాన లోపంగా మారుతోంది. దీనికి మరో ప్రత్యామ్నాయంగా జింగ్‌వాంగ్‌ బృందం త‌యారు చేసిన‌ బయోసెన్సర్ ఎంతో వేగంగా ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తుంది.‘లోకలైజ్డ్‌ సర్ఫేస్‌ ప్లాస్మన్‌ రిసోనెన్స్‌’ సాంకేతికతను ఇందుకోసం వినియోగించినట్లు బృందం స‌భ్యులు మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండ‌గా  వీళ్లు త‌యారు చేసిన బ‌యో సెన్సార్ ద్వారా వైర‌స్ అనుమానిత ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్న వ్య‌క్తిని ప‌ట్టేస్తుంద‌ని చెబుతున్నారు.

 

 అంటే  అనుమానిత వ్యక్తుల్లో చాలా తక్కువస్థాయిలో వైరస్‌ ఉన్నప్పటికీ ఈ పరీక్ష ద్వారా తెలిసిపోతుంద‌న్న మాట‌. ఈ సెన్సర్‌తో ఎంతో సురక్షితంగా, కచ్చితత్వంతో వైరస్‌ను కనిపెట్టవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.ఇదిలా ఉండ‌గా చ‌లిప్ర‌దేశాల్లో, ప్రాంతాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డిస్తున్న నేప‌థ్యంలో ఐరోపాతో పాటు చాలా దేశాలు ఉప‌ద్ర‌వానికి అడ్డుక‌ట్టవేసేందుకు త‌గిన ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు మొద‌లుపెట్టాయి. సెప్టెంబ‌ర్‌లో వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉంటుంద‌ని వినిపిస్తున్న దరిమిలా అప్ప‌టిలోగానైనా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుందే లేదో వేచి చూడాలి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: