ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట‌కాలం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను చుట్టుముట్టేసింది. ఈ క్ర‌మంలోనే అనేక మంది ప్రాణాల‌ను కూడా బ‌లితీసుకుంటుంది. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించింది. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటిప‌ట్టునే ఉండాల్సి వ‌స్తుంది. అయితే ఇలాంటి టైమ్‌లో షియోమీ ప్రియుల‌కు గుడ్ న్యూస్ అని చెప్పాలి‌. త‌ర్వ‌లోనే షియోమి నుంచి రెడ్ మీ 10ఎక్స్ అనే మ‌రో బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ రానున్న‌ట్టు కొన్ని లీకుల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు కూడా లీక్ అయ్యాయి.

 

వాటి ప్ర‌కారం..  మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ తో రానున్న మొదటి ఫోన్ ఇదే కానుంద‌ని స‌మాచారం. దీంతో పాటు ఈ ఫోన్ ఫొటోలు కూడా లీకయ్యాయి. రెడ్ మీ నోట్ 9 ప్రో తరహాలో దీని కెమెరాలను అమర్చారు. డిస్ ప్లే పంచ్ హోల్ తరహాలో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్  స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను ఇందులో ఉండ‌నున్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనున్న‌ట్టు తెలుస్తోంది. ఇక రెడ్ మీ 10ఎక్స్ కెమెరా విష‌యానికి వ‌స్తే..  ఈ స్మార్ట్ ఫోన్ ముందువైపు నాలుగు కెమెరాలు ఉన్నట్టు స‌మాచారం. 

 

ఇక ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రియు 13 మెగా పిక్సెల్స్‌తో సెల్ఫీ కెమెరా ఉండ‌నుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ స్కై బ్లూ, పైన్ మార్నింగ్ గ్రీన్, ఐస్ ఫ్రాగ్ వైట్ రంగుల్లో అందుబాటులోకి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌ దీనికి సంబంధించిన సేల్ వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఏప్రిల్ 27వ తేదీన జరగనున్న షియోమీ లాంచ్ ఈవెంట్ లో రెడ్ మీ 10ఎక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం క‌నిపిస్తోంది. ఇక ఫైన‌ల్‌గా దీని ధ‌ర విష‌యానికి వ‌స్తే.. రెడ్ మీ 10ఎక్స్ సుమారు రూ.16,000 ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: