ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు మిన‌హా.. మిగిలిన అన్ని సంస్థ‌లు మూత ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు కూడా ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. అయితే ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో చాలా మంది ఫోన్‌కే ప‌రిమితం అవుతున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో డిస్నీ+ హాట్‌స్టార్ బాలల్ని రోజంతా ఇంట్లోనే ఉల్లాసంగా ఉండేలా చేస్తుండగా.. హిందీ, తమిళం మరియు తెలుగు టైటిళ్లను డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో మరియు ఇంగ్లీషు టైటిళ్లను డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. 

 

అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 లాంటి యాప్స్‌కు పోటీగా డిస్నీ+ హాట్‌స్టార్ వచ్చింది మ‌రి మీరు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్‌. లాక్‌డౌన్ కష్టాల్లో వున్న  ప్రజల కోసం  మొబైల్ సేవల సంస్థ భారతి ఎయిర్‌టెల్ సరికొత్త డేటా ప్యాక్ తీసుకొచ్చింది.  రూ .401ల ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ను ప్రకటించింది. ఇందులో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది ఎయిర్‌టెల్‌. వాస్త‌వానికి డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది ప్లాన్ తీసుకోవాలంటే రూ.399 చెల్లించాలి. 

 

కానీ ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు రూ.401 రీఛార్జ్ చేసుకొని డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.  దీంతోపాటు డేటా ప్రయోజనాలను అందిస్తోంది.   రోజుకు 3 జీబీ డేటాను 28 రోజులు అందిస్తుంది. అయితే,  ఇందులో కాలింగ్, ఎస్ఎంఎస్ లాంటి సదుపాయాలువుండవు.   ఈ ప్లాన్‌తో రూ.399 విలువ గల ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. మీరు ఈ ప్లాన్‌ను ఒక ఏడాదిలో ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ఇక ఇప్ప‌టికే ఎయిర్‌టెల్ రూ .398 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. ఇది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా అందిస్తుంది. ఇక ఇందులో రోజుకు 3 జీబీ డేటాతో పాటు ఉచిత వాయిస్ కాలింగ్ , ఎస్ఎంఎస్ ప్రయోజనాలు అందిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: