అవును.. టెక్నాలజీ పెరిగింది.. ఎక్కడ ఉన్న మనిషి అక్కడే కూర్చొని పని అంత చెయ్యచ్చు.. మాట్లాడుకోవాలంటే ఫోన్.. చూసుకోవాలంటే వీడియో కాన్ఫరెన్స్ అన్ని అందుబాటులోకి వచ్చేసాయి. ఇంకా ఈ లాక్ డౌన్ సమయంలో ఈ ఈ టెక్నాలజీఏ అందరికి ఉపయోగపడుతుంది.. ముఖ్యంగా ఉద్యోగులకు. 

 

ఉద్యోగులకు వాట్సాప్ వీడియో కాల్స్ పనికిరావు.. అందుకే జుమ్ ని వినియోగిస్తున్నారు. నిజానికి ఈ లాక్ డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ లు ఎక్కువ అయ్యాయి. అందుకే ఇది అంత కూడా. దీంతో ఇన్నాళ్లు వీడియో కాన్ఫరెన్స్ వంటి ఫీచర్లు మెసెంజర్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ మెసెంజర్ రూమ్స్ అనే ఫిచర్ ని తీసుకువచ్చింది. 

 

  సాధారణంగానే ఎలాంటి పోటీదారులకైన మట్టి కరిపించడం ఫేస్ బుకే సాధ్యం అవుతుంది.. ఇంకా ఇప్పుడు తాజాగా జూమ్ యాప్‌ను ఢీకొట్టేందుకు ఆకర్షణమైన అద్భుతమైన ఫీచర్ ని తెరమీదకు తీసుకువచ్చింది. అదే మెసెంజర్ రూమ్స్.. దీన్ని ఫేసుబుక్ మెసెంజర్ యాప్ కు కొత్తగా సరికొత్తగా వీడియో కాన్ఫరెన్స్ వెర్షన్ ను జోడించారు. 

 

అయితే ఇందులో అందరికి నచ్చేది ఏంటి అంటే? ఈ మెసెంజర్ రూమ్ లో ఒకేసారి 50మందితో టైమ్ లిమిట్ ఏ లేకుండా సమావేశం అవ్వచ్చు.. నిజానికి యాప్‌ ఫ్రీ వెర్షన్‌లో 100 మంది వరకు సమావేశమయ్యే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ కేవలం 40 నిముషాలు మాత్రమే సమావేశం అవ్వగలరు.. ఎందుకంటే అక్కడ టైమ్ లిమిట్ ఉంది. 

 

ఇంకా అంతేకాదు.. మరో ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.. అది ఏంటి అంటే? ఫేసుబుక్ మెసెంజర్ రూమ్ లో సమావేశం కావాలి అనుకునే వారికీ ఫేస్‌బుక్ అకౌంట్ లేకపోయినా వినియోగదారులు తమ ''మెసెంజర్‌ రూమ్స్‌''లోకి వారిని ఆహ్వానించవచ్చు. ఏమైతేనేం కరోనా వైరస్ కారణంగా ఫేస్ బుక్ కూడా మెసెంజర్ రూమ్ ని రెడీ చేసింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: