నేటి కాలంలో ప్ర‌తి ఒక్క‌రి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉండ‌డం కామ‌న్ అయిపోయింది. ఉద‌యం లేచింది మొద‌లు.. రాత్రి ప‌డుకునే ముందు వ‌ర‌కు ఫోన్ చేతులోనే ఉంటుంది. కొంద‌రు ప‌క్క‌లోనే ఫోన్‌ను పెట్టుకుని మ‌రీ ప‌డుకుంటారు. ప్ర‌స్తుతం అవ‌స‌రాల‌కు ఫోన్ ఒక అవ‌స‌రంగా మారింది. ఈ క్ర‌మంలోనే ఫోన్ లేనిది బ‌ట‌య కాలు కూడా పెట్ట‌డం లేదు. ఇక రోజంతా పనుల మీద బయటికెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంతో గడపాల్సిన సమయంలో కూడా చేతిలో ఫోన్ లేకపోతే జనాలు ఉండలేకపోతున్నారు. అయితే ఎన్ని వచ్చినా అరచేతిలో ఇమిడిపోయే బుల్లి కంప్యూటర్‌ స్మార్ట్‌ఫోన్‌. 

 

స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. వాచ్‌లా మణికట్టుకు పెట్టుకోవడం దగ్గర నుంచి మెటల్‌ డిక్టేటర్‌ టెక్నాలజీ వరకూ అంతా స్మార్ట్ మయం. ఇదిలా ఉంటే.. స్మార్ట్‌ఫోన్ వాడేవారిలో కొంద‌రు చిన్న చిన్న త‌ప్పులు చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో కొన్ని త‌ప్పులు చేస్తే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వు. మ‌రి ఆ త‌ప్పులు ఏంటి..? వాటి వ‌ల్ల వ‌చ్చే తిప్ప‌లు ఏంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ ఛార్జ్ అవుతోన్న సమయంలో ఫోన్ మాట్లాడటం కాని, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వంటి పనులను చేయకూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒక్కోసారి ఫోన్ పేలా అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

 

మొబైల్ ఛార్జింగ్ అయిన వెంటనే వీడియో కాల్ , హెవీ గేమ్స్ అస్సలు ఆడకూడదు. ఛార్జింగ్ అయిన తర్వాత మొబైల్ హీట్ ఉంటే ఐదు నిమిషాల వరకు మొబైల్ ని పట్టుకోకుండా, ఫాంట్ జాబులో పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి ఫోన్‌ను తొలగించండి. లేకుండా ఫోన్ ఓవ‌ర్ హీర్ అయిపోతుంది. అలాగే వేడి మీ ఫోన్‌కు ప్రధాన శత్రువు. కాబట్టి, మీ ఫోన్‌ను వేడి వాతావరణంలో ఛార్జ్ చేయకండి, చల్లటి ప్రదేశంలో ఉండేలా చూసుకోండి. మ‌రియు డామెజ్ అయిన బ్యాటరీతో ఫోన్‌ను అస్స‌ల వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని రీప్లేస్ చేయ‌డం ఉత్త‌మం. 

 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: