భారత్ లో అతి తక్కువ ధరకే లభించే అద్భుతమైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఏంటి అంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. రెడ్ మీ అని. అలాంటి సూపర్ స్మార్ట్ ఫోన్ నుండి ఎన్నో అద్భుతమైన ఫోన్లు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ నేపథ్యంలోనే తమ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన సూపర్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ తీసుకురానుంది. 

 

 ఆ స్మార్ట్ ఫోన్ ఏంటి? దాని ప్రత్యేకతలు ఏంటి? స్పెసిఫికేషన్లు ఏంటి? అసలు ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఇంకా ఈ రెడ్ మీ నోట్ 9 ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి.. ఎలా అంటే? 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, 5020 ఎంఏహెచ్ గా బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. కాగా ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ వెనకభాగంలో ఉంది. 

 

ఇంకా ఇందులో 3 జీబీ, 4 జీబీ, 6 జీబీ ర్యామ్ ఆప్షన్స్, 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ కలిగి ఉన్నాయి.  ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ ఉండగా 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్ మరియు 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. 

 

ఇకపోతే ఈ రెడ్ మీ నోట్ 9 ప్రో ధర రూ.13,999గా ఉండగా, రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ధర రూ.16,499గా నిర్ణయించారు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ లు ఈ నెలలోనే లాంచ్ కానున్నాయి. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లు ఫారెస్ట్ గ్రీన్, పోలార్ వైట్, మిడ్ నైట్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉండనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: