షియోమీ ఈ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లతో తమ వినియోగదారులను ఆకట్టుకుంటుంటాయి ఈ స్మార్ట్ ఫోన్లు.. అలాంటి ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇప్పుడు మరో సరికొత్త అద్భుతమైన ఫోన్ ని లాంచ్ చేసింది. అదే షియోమీ ఎంఐ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్. 

 

ఎంఐ నోట్ 10 సిరీస్ లో ఇప్పటికే ఎన్నో ఎంఐ నోట్ 10, ఎంఐ నోట్ 10 ప్రో లాంచ్ అవ్వగా ఇప్పుడు మూడు స్మార్ట్ ఫోన్. ఇంకా ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అందించారు.. అతి తక్కువ ధరకే.. అతి ఎక్కువా కాలం వచ్చేలా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, డిస్ప్లే వచ్చాయి. మరి ఈ స్మార్ట్ ఫోన్ లో సూపర్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దాం. 

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు.. 

 

6.47 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 

 

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, 

 

64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి,

 

సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ గా అందించారు,

 

బ్యాటరీ సామర్థ్యం 5260 ఎంఏహెచ్ గా ఉంది,

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,

 

ధర.. 

 

ఎంఐ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి.. ఇంకా మొదటి వేరియంట్ 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.29,000గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.33,100గా ఉంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లు మిడ్ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్, గ్లేసియర్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: