ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం శ‌ర‌వేగంగా వ్యాప్తిచెందింది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే వ్యాక్సిన్ లేని ఈ క‌రోనాను క‌ట్ట‌డి చేసేందు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఇటు భారత్‌ కూడా కరోనాను మరింత కట్టడి చేసే ఆలోచనలో భాగంగా లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు.

 

ఇక కరోనా పుణ్యమా అని ఏమీ జరగవనుకున్నవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి.  కరోనా ఎఫెక్ట్‌కి పలు సాఫ్ట్‌‌వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలు సైతం ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్ హోమ్‌‌ ఇచ్చాయి. అయితే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసేవారికి ఎదుర‌య్యే ప్ర‌ధాన స‌మ‌స్య ఇంట‌ర్నెట్‌. ఇక ఇలాంటి వారి కొసం రిలయన్స్‌ జియో ప్రత్యేకమైన రిఛార్ట్‌ ఆఫర్స్‌, బెనిఫిట్స్‌ అందిస్తోంది. తాజాగా కూడా ఓ అద్భుత‌మైన జియో ప్లాన్ ను తీసుకువ‌చ్చింది. రిలయెన్స్ జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ధర రూ.251. 

 

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి 51 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. అంటే మొత్తం 102 జీబీ డేటా ల‌భిస్తుంద‌న్న‌మాట‌. ఇక ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు.  ఒకవేళ కస్టమర్ ఒక రోజులో 2 జీబీ కన్నా ఎక్కువ వాడితే ఆ తర్వాత 64 కేబీపీఎస్‌తో డేటా వాడుకోవచ్చు. ఈ డేటాకు లిమిట్ లేదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ తక్కువ ఉంటుంది. ఏదేమైన‌ప్ప‌టికీ ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రిలయన్స్‌ జియో సరికొత్త ఆఫర్ల‌ను ప్రవేశ పెడుతూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: