ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రంగాలు భారీ స్థాయిలో నష్టపోయాయి. ఇక లాక్ డౌన్ కారణంగా కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయడం కూడా ఆగిపోయింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలలో సడలింపులు జరపడంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు వారి వ్యాపారం ప్రారంభించాయి. ఇక xiaomi కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించడం జరిగింది. ఈ లాంచ్ ఈవెంట్ మే 8న MI 10 స్మార్ట్ ఫోన్ ను భరత్ లో లంచ్ చేస్తున్నామని తెలియజేయడం జరిగింది.

 

నిజానికి ఈ ఈ ఫోన్ చాలా రోజులు ముందే లంచ్ చేయాల్సి ఉంది కానీ.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా చేయాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ఫోను భారతదేశంలో రిలీజ్ చేసేందుకు కంపెనీ సంస్థ సిద్ధమయ్యింది. ఇక గతంలో లాంచ్ చైనా MI10 , MI 10 ప్రో స్మార్ట్ఫోన్లు లాంచ్ చేయడం జరిగింది. దాదాపు ఈ రెండు ఫోన్లు కూడా స్పెసిఫికేషన్స్ ఒకే అలాగే ఉంటాయి..  రెండు ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్, 5జీ కనెక్టివిటీ సపోర్ట్, 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ లాంటి ప్రత్యేకతలు ఉండడం విశేషం.  ఈ ఫోన్లో ఉండే ప్రత్యేకత ఏమిటి అన్న విషయానికి వస్తే... 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం మరో హైలెట్ అవ్వడం గమనార్హం.

 


షావోమీ ఎంఐ 10 స్పెసిఫికేషన్స్ పూర్తి వివరాలు మీ కోసం..

ర్యామ్: 8జీబీ, 12జీబీ
డిస్‌ప్లే: 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 865
రియర్ కెమెరా: 108+13+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,780 ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 11+ఆండ్రాయిడ్ 10 

 

ఇక అతి ముఖ్యమైన ధర వివరాలు ఇలా..

8జీబీ+256జీబీ- సుమారు రూ.44,000
12జీబీ+256జీబీ- సుమారు రూ.44,000
8జీబీ+128జీబీ- సుమారు రూ.41,000

మరింత సమాచారం తెలుసుకోండి: