ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫోన్ లు లాంచ్ చేసింది.. అలాంటి ఈ పోకో బ్రండ్ ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్ ని లాంచ్ చేయనుంది.. పోకో ఎఫ్ 2 ప్రో అనే కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు మొన్న ఈ మధ్య వార్తలు వచ్చాయి.. అయితే అప్పుడు ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది చెప్పలేదు.. కానీ ఇప్పుడు డేట్ ప్రకటించేసింది. 

 

IHG


 
అయితే ఇప్పటికే ఈ పోకో ఎఫ్2 సిరీస్ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు అన్ని లీకయ్యాయి. కానీ ఆ రిపోర్టులను పోకో ధ్రువీకరించలేదు. ఇకపోతే పోకో తన ఉత్పత్తులు గ్లోబల్ లాంచ్ మే 12వ తేదీన జరపనున్నట్లు ఈరోజు ప్రకటించింది. అవి పోకో ఎఫ్2, పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్లే అయ్యే అవకాశం ఉందని సమాచారం. 

 

IHG

 

ఇంకా పోకో ఎఫ్2, పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్ల ధర ఇలా ఉంది.. పోకో ఎఫ్2 స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.46,800 ఉండగా.. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.53,300గా ఉందనున్నట్టు, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.61,600 ఉందనున్నట్టు వార్తలు వచ్చాయి.. అయితే వీటిలో ఏ ధర పూర్తి సమాచారం లేదు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లు బ్లూ, గ్రే, పర్పుల్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. మరి ఈ స్మార్ట్ ఫోన్ల ధర ఎంత ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: