ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు మదర్స్ డే.. ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం ఈ దినోత్సవం జరుపుకుంటారు.. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు మదర్స్ డే.. కానీ ఈ వారం జరుపుకోడానికి కుదరలేదు.. ఎందుకో తెలుసా? కరోనా వైరస్ వల్ల .. ఎంతకాదు అన్న.. ప్రతి ఒక్కరు వారి అమ్మకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి కేక్ కట్ చేయించి వారి ప్రేమను చూపిస్తారు.. 

 

కానీ ఈసారి ఈ కరోనా వైరస్ నియంత్రించేందుకు లాక్ డౌన్ ప్రకటించారు... దీంతో అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.. ఇంకా బయటకు వెళ్లేకి లేదు.. ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించి రెడీ చేసేకి క్రాఫ్ట్స్ వస్తువులు ఏవి లేవు.. ఇంకా తల్లికి స్పెషల్ గా ఏం చెయ్యగలం అని అందరు బాధ పడుతారు అని గూగుల్ ఓ విన్నూత ఆలోచన చేసింది.. 

 

అది అందరికి తెగ నచ్చేస్తుంది.. అసలు ఏం చేసింది అంటే? మదర్స్ డే 2020 స్పెషల్ గా గూగుల్ డూడుల్ క్రియేట్ చేసింది. ఇంకా ఆ గ్గోగ్లే డూడుల్ తో హ్యాపీ మదర్స్ డే అని కొన్ని బొమ్మలతో వర్చువల్ గ్రీటింగ్ కార్డు చాలా ఈజీగా తయారు చేసేలా ఆ గూగుల్ డూడుల్ క్రియేట్ చేశారు.. దీంతో నెటిజన్లు అంత కూడా ఆ గూగుల్ డూడుల్ కి ఓ రేంజ్ లో ఆకర్షితులు అవుతున్నారు.. 

 

ఆ కార్డుని ఎక్కడ నుండి అయినా పంపచ్చు.. వాట్సాప్, ఫేస్ బుక్ ఇలా అన్ని రకాలుగా ఆ కార్డుని పంపచ్చు.. ఎంతో అందంగా ఆ కార్డుని రెడీ చేసి మీ మదర్ కి కూడా విష్ చెయ్యండి.. సంవత్సరం అంత ఎంతో ఆనందంగా గడిపేస్తుంది.. ఏది ఏమైనా.. ప్రపంచంలో పిల్లలను ప్రేమించే ప్రతి తల్లికి హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలు... 

మరింత సమాచారం తెలుసుకోండి: