ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ల‌తో పాటు ల్యాప్‌టాప్ల‌ను కూడా భారీగానే వినియోగిస్తున్నారు. కంప్యూటర్ కోర్సు కోసమో, బిజినెస్ కోసమనో, పర్సనల్ వర్క్ కోసం చాలామంది తమకు కావాలిసిన కాన్ఫిఫిగరేషన్లతో కూడిన ల్యాప్‌టాప్‌లను వేలకు వేలు పోసి కొనుగోలు చేస్తుంటారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో.. ఉద్యోగులంద‌రూ ఇంటి వ‌ద్దే ల్యాప్‌టాప్‌లో వ‌ర్క్ చేస్తున్నారు. అయితే ల్యాప్‌టాప్‌లో ముఖ్యమైన పని చేస్తున్న‌ప్పుడు.. అనేకోకుండా బ్యాటరీ పవర్ ఒక్క‌సారిగా త‌గ్గిపోతుంది. 

 

మరీ ముఖ్యంగా ల్యాప్‌టాప్‌తో బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్య ఎదురైతే.. అప్పుడు వ‌చ్చే చిరాకు అంతా ఇంతా కాదు. వాస్త‌వానికి పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చేందుకు అందుబాటులోకి వచ్చిన ల్యాప్‌టాప్‌లకు బ్యాటరీ అనేది ఎంతో కీలకంగా మారింది. బ్యాటరీ చార్జింగ్ లేకుంటే ల్యాపీ స్పందించటం మానేస్తుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా చేయ‌వ‌చ్చు. అందులో ముందుగా.. ల్యాప్‌టాప్‌లో మీకు అవసరం లేని యాప్స్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ శక్తిని ఆదా చేసుకోవచ్చు.

 

అలాగే ల్యాప్‌టాప్‌కు జతచేసిన ఎక్స్‌ట్రా యూఎస్బీ, ఇతర ఎక్స్‌టర్నల్ డివైజ్‌లను తొలగించడం వ‌ల్ల కూడా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. అదేవిధంగా, ల్యాప్‌టాప్ ఎల్‌సీడీ స్క్రీన్‌‌ బ్రైట్నెస్‌‍ను గరిష్టంగా తగ్గించుకోవటంతో పాటు కీబోర్ట్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీ ల్యాప్‌టాప్ బ్యాట‌రీ సేవ్ అవుతుంది. ఇక వీలైనంత వరకు ల్యాప్‌టాప్‌ను వేడికి దూరంగా ఉంచండి. వేడికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం వ‌ల్ల ల్యాప్‌టాప్ బ్యాటరీ ఈజీగా డౌన్ అయిపోతుంది. అందుకే చ‌ల్ల‌టి ప్ర‌దేశంలో కూర్చుని వ‌ర్క్ చేసుకోండి. ఇక సీడీ, డీవీడీ డ్రైవ్‌లను ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచటం ద్వారా ల్యాప్‌టాప్‌ బ్యాటీరీ సేవ్ అవుతుంది. వీలైనంత తొందరగా ల్యాప్‌టాప్ మీద పనులను ముగించుకుంటే.. ఇంకా మంచిది. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: