ప్రస్తుత టెక్నాలజీ కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య రోజురోజుకూ ఏ స్థాయిలో పెరుగుతుందో.. అంతే స్థాయిలో వాట్సాప్ వినియోగం కూడా పెరుగుతూ వ‌స్తోంది. మెసేజింగ్, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడానికి లక్షలాది మంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఫోన్ లోను ఈ యాప్ తప్పనిసరిగా ఉంటోందంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఈ క్ర‌మంలోనే వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య కోట్ల‌లో ఉంది. వాట్సాప్ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూ.. యూజ‌ర్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇది కూడా వాట్సాప్ వినియోగం పెర‌గ‌డానికి ఓ కార‌ణంగా చెప్పాలి. 

 

అయితే వాట్సాప్‌లో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో ఫీచ‌ర్ల ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా ఎమోజీ షార్ట్ కట్. వాట్సాప్ వెబ్ లో మీరు ఎమోజీలను ఉపయోగించడానికి అవసరమైన ఎమోజీ ఐకాన్ టెక్స్ట్ బార్ లో లెఫ్ట్‌సైడ్‌ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎమోజీ ట్రే క‌నిపిస్తుంది. కానీ మీరు ఎమోజీ ట్రేను ఓపెన్ చేయకుండా ఎమోజీలను యూజ్ చేయాలంటే.. దానికి కూడా ఇందులో ఒక మార్గం ఉంది. మీరు ‘:’ పెట్టి దాని తర్వాత మీకు కావాల్సిన ఎమోజీకి సంబంధించిన మొదటి రెండు అక్షరాలను టైప్ చేయాలి. 

 

ఉదాహరణకు మీకు బాధను(sad) వ్యక్తపరిచే ఎమోజీ కావాలనుకుంటే :sa అని టైప్ చేస్తే చాలు. మీకు కావాల్సిన ఎమోజీ అక్క‌డ వ‌స్తుంది. ఇక పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్.. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలను వాట్సాప్ యాప్ లో నుంచి బయటకు వెళ్లకుండానే చూడవచ్చు. ఈ వీడియో చాట్ లో కుడి వైపు పైభాగంలో ప్లే అవుతుంది. వినియోగదారులు చాట్ చేస్తూనే వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఈ ఫీచ‌ర్ 2018లో యూజ‌ర్ల‌కు వాట్సాప్ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: