భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు కాంటాక్ట్ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ యాప్ జియో ఫోన్లకు కూడా రావడానికి కొత్త వెర్షన్ ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యాప్ ను ఇంతవరకు ఊ కేవలం ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇక ఇప్పటి నుంచి జియో ఫోన్ వినియోగదారులు కూడా అందుబాటులోకి రానుంది. 

 

ప్రస్తుతం మన దేశంలో ఈ జియో ఫోన్ వినియోగదారులు 50 లక్షల వరకు ఉన్నారు. అయితే ఈ విషయంపై గత వారమే ఆయా ఫోన్లలో ఈ యాప్ రాబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాప్ ను దేశంలో ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారునికి అందుబాటులో ఉండే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని జియో ఫోన్ కూడా ఈ ఆప్ ను అందుబాటులోకి తెచ్చారు.

 

అయితే ఇప్పటివరకు మనదేశంలో ఈ అప్లికేషన్ ను 10 కోట్ల మంది పైగానే డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ అప్లికేషన్ బ్లూ టూత్, జిపిఎస్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తోంది. ఈ అప్లికేషన్ కేవలం హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా దేశంలోని 11 మాతృభాషల అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ అప్లికేషన్ ద్వారా మీ నగరంలో ఉన్న కరోనా హెల్ప్లైన్ సెంటర్ల వివరాలను కూడా మనం అందుకోవచ్చు. మీరు ఉన్న లొకేషన్ ను అప్లికేషన్ కి అనుసంధానం చేస్తే దగ్గర్లోని హెల్ప్ లైన్ సెంటర్ల వివరాలను ఇది మనకు అందిస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి వెంటనే వైద్య సహాయం కూడా మనము అందుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ యాప్ ను మనం ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, ఒడియా భాషల్లో ఈ యాప్ ను ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: