భారతదేశంలో 5g నెట్ వర్క్ రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇంకా రెండు సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేలా ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇకపోతే టెలికాం టెక్నాలజీ పరిశ్రమలలో అనుకున్న విధంగా చేపట్టాల్సిన పనులపై కరోనా మహమ్మారి ప్రభావంతో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇక టెలికాం శాఖ 5జి సేవల వేలం పై ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆ ప్రక్రియ 2021 సంవత్సరంలో మొదలయ్యే అవకాశం ఉందని చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. 


అయితే వేలం విషయంలో ఆలస్యం జరిగితే అది 5g పరీక్షలు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా చేయవలసిన లాంఛనాలతో పూర్తయ్యాయి 5g వాణిజ్య సేవలు 2022 సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో 5g స్పెక్ట్రమ్ ధర యూనిట్ కు 492 కోట్లుగా టెలికం ఆపరేటర్లకు పెద్ద అవరోధంగా మారిందని నిపుణులు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే భారత్ లో బేస్ రేట్ చాలా ఎక్కువగా ఉందని టెలికాం దిగ్గజాలు వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు భారతదేశంలో 5g ప్రణాళికలో చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు ztg, హువాయి పాత్ర పై కొనసాగుతున్న అనిశ్చితి సైతం 5g ఎంట్రీ ని కాస్త ఆలస్యం చేస్తున్నాయని ఒక వార్తా సంస్థ పేర్కొంది.


ఇకపోతే భారతదేశంలో 5g సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మౌలిక సదుపాయాల కోసం చైనా కంపెనీలు పాత్ర కాస్త అనుమానంగానే మారింది. అమెరికా దేశం చేపట్టిన చైనా వ్యతిరేక విధానంతో చాలా దేశాలు హువాయ్ ద్వారా 5g మౌలిక సేవలను పొందేందుకు సుముఖత చూపించట్లేదు. అయితే 5g సేవలు మాత్రం ప్రధానంగా పారిశ్రామిక అప్లికేషన్స్ కు సహకరిస్తాయని సాధారణ ప్రజలకు ఇందువల్ల పెద్ద ప్రయోజనం లేదని తెలిపింది. ఇలాంటి పరిస్థితులను తెలుపుతూ టెలికాం శాఖ 5g ఎంట్రీ మరో సంవత్సరం పాటు ఆలస్యం చేస్తోందని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: