నిజానికి చాలామంది తెలియనివారు గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే అప్లికేషన్స్ అన్ని సురక్షితం అని చాలామంది అనుకుంటారు. కానీ గూగుల్ సంస్థ కళ్ళు కప్పి అనేక ప్రమాదకరమైన అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్ లో చేరుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ సంస్థలు వాటిని కనుగొని గూగుల్ సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయడంతో గూగుల్ సంస్థ వెంటనే వాటిని తొలగించడం జరుగుతూ వస్తోంది.


ఇకపోతే ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ లో గుర్తించబడిన ప్రమాదకరమైన యాప్ లతో పాటుగా గత కొద్ది రోజులనుంచి గూగుల్ ప్లే స్టోర్ లో క్రీప్ వేర్ అనే మరో ప్రమాదకరమైన అప్లికేషన్ కూడా అందులో ఉందని ఈ మధ్యనే తెలిసింది. అయితే ఇవి పూర్తిస్థాయిలో స్పై చేసే అప్లికేషన్ మాత్రం కాదు. కాకపోతే ఇవి మన మొబైల్లో కి ఒకసారి వస్తే అనేక ప్రమాదకరమైన విషయాలను ఇవి తలెత్తేలా చేస్తాయి.


ఇలాంటి వాటి వలన మన మొబైల్లో మనకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ లు ఇంకా ఏమైనా అప్లికేషన్స్ లోకి వెళ్లి అక్కడి సమాచారాన్ని డెవలపర్ కు చేరవేస్తాయి. అయితే అప్పటికే మన ఫోన్ లో ఇన్స్టాల్ చేయబడిన అప్లికేషన్ ను దాచిపెట్టడం, ఇతర అప్లికేషన్ యాక్సిస్ ని కంట్రోల్ చేయడం, ఇంకా మన అనుమతి లేకుండా మన యొక్క లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. తాజాగా గూగుల్ సంస్థ 800 పైగా ఇలాంటి అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించబడింది. కాబట్టి గూగుల్ కళ్ళు కప్పి ఎన్నో అప్లికేషన్స్ మన మొబైల్ లోకి వస్తున్నాయి. కాబట్టి వీటిని ఎదుర్కోవడానికి చాలా అప్రమత్తంగా ఉండండి.


ఏదైనా మీకు అప్లికేషన్ మీద పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి.  లేకపోతే మీ సమాచారం మొత్తం వేరే వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది తస్మాత్ జాగ్రత్త ...!

మరింత సమాచారం తెలుసుకోండి: