ప్రస్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ హ‌వా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు వ్యాప్తిచెందింది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు విల‌విల‌లాడిపోతున్నారు. ఇక ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప‌లు దేశాలు క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్ విధించాయి. దీంతో అన్ని సంస్థ‌లు మూత ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ఉద్యోగులు కూడా ఇంటి నుంచే ప‌ని చేస్తున్నారు. దీంతో ఇంట‌ర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. 

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోంది. ఇక అతి త‌క్కువ ధ‌ర‌లోనే 4జీ డేటాతో జియో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన అదిరిపోయే ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. జియో రూ.151 ప్లాన్‌.  ఇది 4జీ డేటా ప్లాన్. రూ.151 రీఛార్జ్ చేస్తే 30 జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు. 

 

ఇందులో రెండొవ‌ది జియో రూ.201 ప్లాన్‌. ఇది 4జీ డేటా ప్లాన్. రూ.201 రీఛార్జ్ చేస్తే 40 జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు. అలాగే ఇందులో మూడొవ‌ది జియో రూ.251 ప్లాన్. ఇది 4జీ డేటా ప్లాన్. రూ.251 రీఛార్జ్ చేస్తే 50 జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల పాటు వాడుకోవచ్చు.ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు. ఇక అధిక ధ‌ర‌లో మ‌రో అద్భుత‌మైన‌ ప్లాన్ జియో రూ.999 ప్లాన్‌. ఇది క్వార్టర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌. రూ.999 రీఛార్జ్ చేస్తే వేలిడిటీ 84 రోజులు. రోజూ 3జీబీ చొప్పున మూడు నెలలకు 252 జీబీ హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: