అతి త్వరలోనే xiomi సంస్థ నుంచి 3 స్మార్ట్ టీవీ లను మార్కెట్ లోకి విడుదల చేయబోతుంది. షియోమీ నుంచి రెడ్ మీ టీవీ x50, రెడ్ మీ టీవీ x55, రెడ్ మీ టీవీ x65 స్మార్ట్ టీవీలు 26వ తేదీ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి మాత్రం ఈ టీవీ లకు సంబంధించి సైజు గురించి తప్ప మరి ఎటువంటి విశేషాలు బయటకు వెల్లడించలేదు. విషయాన్ని స్మార్ట్ టీవీ రెడ్ మీ జనరల్ మేనేజర్ వింగ్ తెలియజేయడం జరిగింది. అలాగే అదే రోజు షియోమీ రెడ్ మి 10x స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేయబోతుంది. ఇది ఇలా ఉండగా రియల్ మీ సంస్థ కూడా ఒకరోజు ముందు తన స్మార్ట్ టీవీ లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. 


ఇక ఇటీవల రెడ్ మీ విడుదల చేసిన టీజర్ ను అనుగుణంగా.. రెడ్ మీ టీవీఎస్ 50 స్క్రీన్ సైజ్ 50 అంగుళాలు, రెడ్ మీ టీవీ x55 స్క్రీన్ సైజు 55 అంగుళాలు, రెడ్ మీ టీవీ x65 స్క్రీన్ సైజ్ 65 అంగుళాలు ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు ఈ మూడు టీవీలో సైజు ఒకే లాగా ఉండబోతున్నాయి. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా ఒకేలా గా ఉండవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ టీవీలన్నింటికీ పిక్చర్ క్వాలిటీ, సౌండ్ సిస్టమ్, స్మార్ట్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటాయని ప్రకటనలో తెలియజేయడం జరిగింది.

అలాగే అదే రోజు రెడ్ మీ 10X స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేస్తుంది ఇప్పటికే ఈ ఫోన్ గురించి ఎన్నో సమాచారాలు, టీజర్లు బయటకు రావడం జరిగింది. సమాచారం మేరకు ఈ ఫోన్ లో ఫైర్ సపోర్ట్ కూడా ఉండబోతుంది. అలాగే ఈ ఫోన్ డార్క్ బ్లూ, గోల్డ్, సిల్వర్ వైలెట్ కలర్ లలో వినియోగదారుల ముందుకు రాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తూ, ఈ ఫోన్ లో 5జీ సపోర్ట్ కూడా ఉండనుంది. ఇక దీనితోపాటు ఇందులో 6 gb ర్యామ్ + 64 gb స్టోరేజ్, 6 gb ర్యామ్ + 128 gb స్టోరేజ్, 8 gb ర్యామ్ + 128 gb స్టోరేజ్, 8 gb ర్యామ్ + 256 gb స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయని లీకుల ద్వారా సమాచారం తెలుస్తోంది. ఇక ఇవన్నీ లాంచ్ ఈవెంట్ చైనాలో మే 26 మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: