క్రోమ్ బ్రౌజర్ లో సరికొత్త ఫ్యూచర్స్, కొత్త టూల్స్ త్వరలోనే అందించబోతున్నమని సోమవారం నాడు గూగుల్ సంస్థ ప్రకటించింది. గూగుల్ సంస్థ తన అధికారిక బ్లాగ్ లో డెస్క్ టాప్ వెర్షన్ ఐన క్రోమ్ బ్రౌజర్ 83 తన వినియోగదారులకు వెబ్ పై కావాల్సినన్ని కంట్రోలింగ్ సదుపాయాలను కల్పిస్తుందని... ఫలితంగా వారి భద్రత పెరుగుతుందని చెప్పుకొచ్చింది. త్వరలోనే అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్స్ తో వినియోగదారులు సులువుగా కుకీస్(cookies)ని మేనేజ్ చేయగలరు... వ్యక్తిగత పాస్ వర్డ్స్ భద్రంగా ఉంచుకోగలరు... incognito మోడ్ లో కుకీస్ డిలీట్ కూడా చేసుకోగలరు. 


ఈ విషయాలన్నీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. మేము కొత్త ఫీచర్స్ ని విడుదల చేయబోతున్నాం. సరికొత్త ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ ని డెస్క్ టాప్ వెర్షన్ క్రోమ్ లో ఇవ్వబోతున్నాం. బ్రౌజ్ చేసేటప్పుడు మీ భద్రత పెరిగేందుకు సేఫ్టీ చెక్ టూల్ ఇవ్వబోతున్నాం. థర్డ్ పార్టీ కుకీ కంట్రోల్స్ incognito మోడ్ లో ఇస్తున్నాము. వీటితో పాటు మెరుగైన సేఫ్ బ్రౌజింగ్, సెక్యూర్ DNS & మరిన్ని లభించనున్నాయని సుందర్ పిచాయ్ తెలిపాడు. 


క్రోమ్ వెబ్ బ్రౌసర్ లో  కొత్త ఫ్యూచర్ ని యూస్ చేసి వినియోగదారుల తాము వీక్షిస్తున్న వెబ్సైట్ కుకీస్ మేనేజ్ చేయవచ్చు. కుకీస్ ఎలా వర్క్ అవుతాయి ఎటువంటి కుకీస్ యాక్సెప్ట్ చేయాలనే ఒక అవగాహన ఈ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకి వస్తుంది. అలాగే థర్డ్ పార్టీ కుకీస్ రెగ్యులర్, incognito మోడ్ లలో బ్లాక్ చేయవచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా క్రోమ్ బ్రౌసర్ incognito మోడ్ లో కుకీస్ డిలీట్ చేసే ఆప్షన్ ని వినియోగదారులకి అందించబోతుంది. 


సేఫ్టీ చెక్, సేఫ్టీ టూల్ ఫ్యూచర్స్ మీ పర్సనల్ పాస్ వర్డ్స్ ని చెడు వెబ్సైట్స్ దొంగలించకుండా కాపాడతాయి. మీకు ముందస్తుగానే హానికరమైన వెబ్సైట్స్ గురించి సేఫ్ చెకింగ్ టూల్ తెలియజేస్తుంది. అలాగే మీ కంప్యూటర్ లో ఎటువంటి హానికరమైన ఫైల్స్ డౌన్లోడ్ కాకుండా క్రోమ్ బ్రౌజర్ పనిచేస్తుంది. ఇంకా ఇలాంటి ఫీచర్లు ఎన్నో వినియోగదారులకు భద్రత కల్పించి సరికొత్త అనుభూతిని అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: