వాట్సాప్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నేటి త‌రంలో స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్‌ను యూజ్ చేస్తున్నారు. అంత‌లా వాట్సాప్ క్రేజ్ సంపాదించుకుంది. ఓ విధంగా చెప్పాలంటే వాట్సాప్ మన జీవితంలో నిత్యావసరంగా మారిపోయింది.  రోజువారి అవసరాలకు వాట్సాప్‌ను కోట్ల మంది వినియోగిస్తున్నారు. పొద్దున గుడ్ మార్నింగ్ తో మొదలుకొని గుడ్ నైట్ వరకు కొన్ని వందల మెసేజెస్..వీడియో కాల్స్,వాయిస్ కాల్స్,ఫోటోలు ,వీడియోలు షేర్ చేసుకోవడానికి అందరికి చాలా సులువుగా ఉన్న యాప్ వాట్సాప్. 

 

అందుకే వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య కోట్ల‌లో ఉంది. ఇక యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు వాట్సాన్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మైన ఫీచ‌ర్లు తీసుకువ‌స్తూ.. కొత్త పుంత‌లు తొక్కుతోంది. అయితే దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. లేకపోతే మీ వాట్సాప్ అకౌంట్ పూర్తిగా నిషేధానికి గురవడం లేదా సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాదు, మీకు అస్సలు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మీ ఖాతాను సస్పెండ్ చేసే అధికారం వాట్సాప్ కు ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ తన నిబంధనల్లో స్పష్టంగా వెల్ల‌డించింది కూడా. అందులో ముఖ్యంగా.. వాట్సాప్‌లో ఒక‌వేళ‌ మిమ్మల్ని ఎక్కువ మంది యూజర్లు బ్లాక్ చేసినా మీరు వాట్సాప్ లో బ్యాన్ లేదా సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉంది. 

 

కాబట్టి ఎవరో తెలియని వారితో చాట్ చేయాలని ప్రయత్నించి మీ వాట్సాప్ ఖాతాను పోగొట్టుకోకండి. వాట్సాప్ ఖాతాను దుర్వినియోగం చేయకండి. అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది బ్లాక్ చేస్తే మీ అకౌంట్ ను స్పామ్ గా కూడా వాట్సాప్ గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే తెలియ‌న వారికి మెసేజ్ చేసి.. ఎక్కువ శాతం మందితో బ్లాక్ గుర‌వ‌య్యేలా చేసుకోకండి. ఇది మీ వాట్సాప్ అకౌంట్‌కే ప్ర‌మాద‌క‌రం. అంతేకాదు, వాట్సాప్ నియమ నిబంధనల ప్రకారం మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వారికి ఎక్కువ మెసేజ్ లు పంపకూడదు. బల్క్ మెసేజింగ్, ఆటో మెసేజింగ్, ఆటో డయలింగ్ వంటి వాటిని అస్సలు చేయకూడదు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: