ఫేస్ బుక్ లో అమ్మాయి ప్రొఫైల్ కి సంబంధించిన వాటిలో పోస్ట్ చేసే ఫోటోలు విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్న సందర్భాలు ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. అమ్మాయిల ఫోటోలను అపరిచిత వ్యక్తులు డౌన్ లోడ్ చేసుకుని వాటి ద్వారా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో అమ్మాయిల ప్రొఫైల్ కు సంబంధించి ఫోటో లకు సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ కల్పించేందుకు ఫేస్ బుక్ సరికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రొఫైల్ లాక్ పేరిట స‌ద‌రు ఫీచ‌ర్ యూజ‌ర్ల సెక్యూరిటీ కి ఫేస్ బుక్ తీసుకొచ్చింది. ఈ ఫీచ‌ర్‌ వల్ల ఫేస్ బుక్ లో అమ్మాయిలు  త‌మ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవ‌చ్చు.

 

దీంతో కేవ‌లం ఫ్రెండ్స్ మాత్ర‌మే ఆ ప్రొఫైల్‌ను చూసేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే లాక్ అయిన ప్రొఫైల్ క‌లిగిన యూజ‌ర్లు పెట్టే పోస్టుల‌ను కూడా కేవ‌లం వారి ఫ్రెండ్స్ మాత్ర‌మే చూస్తారు. అప‌రిచితులు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను, పోస్టుల‌ను చూసేందుకు అవ‌కాశం ఉండ‌దు. అదేవిధంగా ఏ ఫోటోకి అయితే ప్రైవసీ మరియు సెక్యూరిటీ కల్పించడం జరిగిందో దాన్ని అపరిచితులు డౌన్ లోడ్ చేసే అవకాశం ఉండదు. తాజాగా ఈ ఫీచర్ అందుబాటులోకి రావటంతో 

 

ఫేస్ బుక్ లో అమ్మాయిలు చాలా వరకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి అప్పట్లో రాకపోవటంతో చాలామంది కాపురాలలో, అమ్మాయిల జీవితాలలో అనేక చిచ్చులు అపరిచితులు పెట్టారు. ఇదే సమయం లో అమ్మాయిల ఫోటోలు ఊరికనే డౌన్లోడ్ చేసి పిచ్చి పిచ్చి ఐడి లకు వాడి అమ్మాయిల ప్రాణాలను బలి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మ‌హిళ‌ల‌కు ముప్పు పొంచి ఉంద‌నే నేప‌థ్యంలో ఫేస్‌బుక్ కేవ‌లం మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాగా ఈ ఫీచర్ ని ఎవరైనా వాడుకోవచ్చు అని తాజాగా ఫేస్‌బుక్ ప్ర‌తినిధి తెలిపారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: