మోటరోలా తన బడ్జెట్ మొబైల్ లో భారతదేశంలో విడుదల చేసింది. దాని పేరు మోటో g8 పవర్ లైట్ స్మార్ట్ ఫోన్ అయితే దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు ఈనెల చివరి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాకపోతే ఈ ఫోన్ కు సంబంధించి గ్లోబల్ లాంచ్ ఏప్రిల్ నెలలోనే జరిగింది. ఇకపోతే ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో P - 35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయగా ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లభిస్తుంది. దీనిలో బ్యాటరీ సామర్థ్యం బాగా ఉందని చెప్పాలి. ఈ ఫోన్ లో 5000 mah. కెపాసిటీ గల బ్యాటరీ ఉంది.

 


ఇకపోతే ఇందులో కేవలం ఒక్క వెరైటీ మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది మోటరోలా కంపెనీ. 4 gb ర్యాం, 64 gb మెమొరీ తో వచ్చే ఈ మొబైల్ ఫోన్ ను రూ. 8999 గా కంపెనీ నిర్ధారించింది. ఇక ఈ ఫోన్ 2 రంగులలో లభిస్తోంది. ఆర్కిటిక్ బ్లూ, రాయల్ బ్లూ రంగులో ఈ ఫోన్ మనకు అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లాంచ్ కారణంగా  అప్పుడే కొన్ని ఆఫర్స్ ను ప్రకటించేసింది. ఈ ఫోన్ కు సంబంధించిన సెల్ మే 29న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాబోతోంది.

 


ఫోన్ కొనేవారికి ఫ్లిప్కార్ట్ నుండి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5% క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది. అంతేకాక ఈ ఫోన్ కు EMI ఆప్షన్స్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 6.5 అంగుళాల హెచ్డీ ఎల్ఇడి డిస్ప్లే ఈ ఫోన్ కలిగి ఉంది. ఇందులో మీడియా టెక్ హీలియో P - 35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇక అలాగే ప్రధాన కెమెరా సామర్థ్యం 16 పిక్సెల్ ఉండగా మరో రెండు కెమెరాల్లో కేవలం 2 మెగా పిక్సెల్ ఉన్న సెన్సార్ లను అందించారు. అలాగే ముందు వైపు చూస్తూ కేవలం 8 మెగాపిక్సల్ కెమెరా ను ఇందులో పొందుపరిచారు. ఈ మొబైల్ కి వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులోకి తెచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: