ప్రస్తుతం ప్రపంచమంతా స్తంభించిపోవడంతో ఇంటికే పరిమితమైన కోట్లాదిమంది స్మార్ట్ ఫోన్ లో అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వెబ్ సైట్స్ లలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఫేసుబుక్ సంస్థ సొంతమైన వాట్సాప్ లో సరికొత్త ఫ్యూచర్ లను అందించి తన వినియోగదారులకి మంచి ఎక్స్ పీరియన్సు కల్పిస్తుంది. ఇప్పటికే వీడియో కాల్ గ్రూప్ పరిమితి పెంచడంతోపాటు... మెసేజ్ ఫార్వర్డ్ంగ్ తగ్గించడం... సరికొత్త స్టిక్కర్లను అందుబాటులోకి తేవడం లాంటివి మనందరికీ తెలుసు కానీ ఇంకా ఎన్నో ఫ్యూచర్లు వాట్సాప్ లో దాగున్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తున్నాము. 


1. సెర్చ్ ఓల్డ్ డాక్యుమెంట్, ఇమేజ్:

వాట్సాప్ చాటింగ్ లో ఏదైనా డాక్యుమెంట్ కోసం గానీ, ఫోటో కోసం గానీ వెతకాలంటే మనం సాధారణంగా చాట్ మొత్తం స్క్రోల్ చేసుకుంటూ చూసుకుంటాం. అయితే ఈ విధానం చాలా సమయం తీసుకుంటుంది. కానీ ఐఫోన్ యూజర్లకు కోసం వాట్సాప్ సంస్థ ఇమేజెస్ ని, జిఐఎఫ్స్(gif)ని, ఆడియో వీడియో డాక్యుమెంట్ ఫైల్స్ లను విడివిడిగా సెర్చ్ చేసే ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. ఇందుకోసం మీరు వాట్సాప్ చాటింగ్ లోకి వెళ్లి సెర్చ్ ఐకాన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.


2. వాట్సాప్ షార్ట్ కట్స్:


వాట్సాప్ ఐఫోన్ యాప్ ఒక చాట్(chat) ని ఓపెన్ చేయకుండానే డిలీట్ చాట్, ఎక్స్పోర్ట్ చాట్, క్లియర్ చాట్, మ్యూట్ చాట్ లాంటి ఆప్షన్లను వినియోగదారులకు అందిస్తుంది. దీనికోసం ఐఫోన్ యూజర్లు కావలసిన చార్ట్ పై లెఫ్ట్ సైడ్/ ఎడమవైపు వైపు స్వైప్ చేస్తే త్రీ డాట్స్ కనిపిస్తాయి. ఆ త్రీ డాట్స్ పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఆప్షన్లు కనిపిస్తాయి. 


3. వాట్సాప్ ఓపెన్ చేయకుండానే ఎవరి నుండి మెసేజ్ వచ్చిందో తెలుసుకోవచ్చు:


వాట్సాప్ అన్న తర్వాత ఎన్నో మెసేజ్లు వస్తూ ఉంటాయి. మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ లోకి వెళ్లి చెక్ చేయడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. అలాగే కొంతమంది తమ ఆన్లైన్ ఆక్టివిటీ దాచి పెట్టాలని... మెసేజ్ లు తాము చదివినట్టు ఇతరులకు తెలవకుండా ఉండాలనుకుంటారు. అయితే అటువంటి వారికోసం వాట్సాప్ లో సరికొత్త ఫ్యూచర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మీ ఐఫోన్ హోమ్ స్క్రీన్ పై ఎడమవైపు స్వైప్(swipe) చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్ పై మీ వేలును 2 సెకనుల పాటు ఉంచితే... విడ్జెట్స్ (Widgets) అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన అనంతరం మీకు మీ ఐఫోన్ లో ఉన్న అప్లికేషన్ల ఐకాన్స్ కనిపిస్తాయి. వాటిలో వాట్సాప్ 4x2/4x4 అనే స్క్వేర్ రూపంలో కనిపిస్తోంది. ఆ ఐకాన్ పై లాంగ్ క్లిక్ చేసి మీ హోం స్క్రీన్ లేదా పక్క పేజీలో వాట్సాప్ విడ్జెట్ ని యాడ్ చేయొచ్చు. ఈ వాట్సాప్ విడ్జెట్ ని మీకు కావలసినంత సైజు లో పెంచుకోవచ్చు. ఈ విడ్జెట్ ద్వారా ప్రతి మెసేజ్ ని వాట్సప్ ఓపెన్ చేయకుండానే మీరు చదువుకోవచ్చు. 

ఇకపోతే మీరు బాగా చాటింగ్ చేసే వ్యక్తి యొక్క చాట్ ఎల్లప్పుడు పైన కనిపించాలంటే... వారి చాట్ పై లాంగ్ ప్రెస్ చేసి 'Pin chat' అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్క కాంటాక్ట్ కు మీకిష్టమైన మెసేజ్ టోన్ ను సెట్ చేసుకునే ఆప్షన్ కూడా వాట్సాప్ఫోన్ యాప్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: