గత చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా స్మార్ట్ వాచ్ ను రియల్‌ మీ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ స్మార్ట్  వాచ్ లో కలర్ డిస్ప్లే, 2.5 డి క్వార్టర్ గ్లాస్ వంటి ఫీచర్లు అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ లో ప్రీపెయిడ్ వాచ్ ఫేస్ కూడా లభించాయి. ఇక దీంతో రెడ్ మీ అప్డేట్ ద్వారా 100 వాచ్ పేస్ లను అందించబోతుంది. ఇక ఈ  వాచ్ ధరను రూ.3999 గా కంపెనీ నిర్ధారించడం జరిగింది.

 

ఇక ఈ వాచ్ కు సంబంధించిన సేల్ జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభం అవ్వబోతుంది. ఈ వాచ్ రియల్‌ మీ, ఫ్లిప్కార్ట్ వెబ్ సైట్లలో అందుబాటులోకి వినియోగదారుల ముందుకు రాబోతుంది. ఇక ఆ తర్వాత ఆఫ్ లైన్ ద్వారా కూడా విక్రయాలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నది. ఇక ఈ వాచ్ రెడ్, బ్లూ, గ్రీన్ కలర్ లో వినియోగదారుల ముందుకు తీసుకురావడం జరిగింది. 

 

ప్రస్తుతం ఉన్న ఎన్నో స్మార్ట్ వాచ్ లతో సహా రియల్‌ మీ కూడా ఫిట్నెస్ స్మార్ట్ టీచర్లు ఇలా చాలా ఫ్యూచర్ ను అందిస్తుంది. అలాగే ఈ వాచ్ లో హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా అందించడం జరిగింది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మీ గుండె చప్పుడు కూడా రికార్డు చేస్తుంది.  అంతేకాకుండా ఇందులో బ్యాట్మెంటన్, క్రికెట్... ఇన్డోర్, ఔట్డోర్, యోగా వంటి స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. 

 

అలాగే ఈ స్మార్ట్ వాచ్ ను ఉపయోగించుకొని వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ మెసేజ్ లు కూడా నోటిఫికేషన్ల రూపంలో మీకు అందజేస్తుంది. అలాగే ఇందులో బ్లూటూత్ కనెక్టవిటీ ఫీచర్లు కూడా సంస్థ అందజేసింది. అలాగే ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ లేదా దాని కంటే తర్వాత వచ్చిన వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేయబోతున్న ఈ స్మార్ట్ వాచ్. ఇక ఈ స్మార్ట్ వాచ్ లో 160 mah బ్యాటరీ అందించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: